స‌మాచారం

Personal Loan : ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకుంటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోవ‌డం త‌ప్ప‌నిసరి..!

Personal Loan : వాహ‌న రుణం కావాలంటే మ‌నం కొనే వాహ‌న‌మే బ్యాంకుకు సెక్యూరిటీగా ఉంటుంది.. అలాగే హోం లోన్ అయితే ఇల్లు.. ప్రాపర్టీ లోన్ అయితే ప్రాప‌ర్టీల‌ను బ్యాంకులు సెక్యూరిటీగా ఉంచుకుంటాయి. కానీ ఎలాంటి సెక్యూరిటీ, హామీ లేకుండా ఇచ్చేది ప‌ర్స‌న‌ల్ లోన్. ఇది సుల‌భంగానే దొరుకుతుంది. కానీ ఎవ‌రైనా స‌రే ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకునే ముందు ప‌లు అంశాల‌ను గ‌మ‌నించాల్సి ఉంటుంది. అవేమిటంటే.. సాధార‌ణంగా ఇత‌ర ఏ లోన్ అయినా మ‌న‌కు సుల‌భంగానే ల‌భిస్తుంది. కానీ ప‌ర్స‌న‌ల్ లోన్ రావాలంటే కొంత క‌ష్ట‌ప‌డాలి. ముఖ్యంగా మ‌న సిబిల్ స్కోరు 750కి పైగా ఉండాలి. మ‌నం గ‌తంలో ఏవైనా లోన్ల‌ను తీసుకుని ఉంటే వాటిని స‌రైన టైముకు చెల్లించామా, లేదా, ఏవైనా డ్యూస్ మిగిలి ఉన్నాయా.. ఒక వేళ క్రెడిట్ కార్డుల‌ను వాడుతూ ఉంటే వాటి బిల్లుల‌ను నెల నెలా స‌కాలంలో చెల్లిస్తున్నామా, లేదా.. అనే వివ‌రాల‌ను బ‌ట్టి సిబిల్ స్కోరు జ‌న‌రేట్ అవుతుంది. ఈఎంఐ, బిల్లు చెల్లింపులు స‌క్ర‌మంగా ఉంటే ఎలాంటి దిగులు చెందాల్సిన ప‌నిలేదు. సిబిల్ స్కోరు బాగానే ఉంటుంది.

ఈ క్రమంలో ఎవ‌రైనా స‌రే.. ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకునే ముందు ఒక్క‌సారి సిబిల్ స్కోరు 750 పైన ఉందా, లేదా చూసుకోవాలి. 750 క‌న్నా స్కోరు త‌క్కువ ఉంటే లోన్‌కు అప్లై చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే లోన్ వ‌చ్చేందుకు అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అలాంటి స్థితిలో లోన్‌కు అప్లై చేస్తే అది రాక‌పోతే.. అప్పుడు సిబిల్ మ‌రింత త‌గ్గుతుంది. క‌నుక 750 క‌న్నా సిబిల్ స్కోరు త‌క్కువ ఉంటే ప‌ర్స‌న‌ల్ లోన్‌కు అప్లై చేయ‌రాదు. ప‌ర్స‌న‌ల్ లోన్ కు సాధార‌ణంగా 10.99 నుంచి 24 శాతం వ‌ర‌కు ఫైనాన్స్ సంస్థ‌లు, బ్యాంకులు వ‌డ్డీని విధిస్తుంటాయి. క‌నుక వడ్డీపై కూడా క‌న్నేయాలి. త‌క్కువ వ‌డ్డీకి వ్య‌క్తిగ‌త రుణం ల‌భిస్తే మంచిది. దీంతో రుణం మొత్తం చెల్లించినా పెద్ద‌గా వ‌డ్డీ క‌ట్టాల్సిన ప‌ని ఉండ‌దు. అదే వ‌డ్డీ ఎక్కువైతే.. రుణానికి స‌మానంగా వ‌డ్డీయే చెల్లించాల్సి వ‌స్తుంది. క‌నుక లోన్ తీసుకునే ముందు వ‌డ్డీ రేటు ఎక్క‌డ త‌క్కువ ఉందో చూసుకుని మ‌రీ లోన్ తీసుకోవాలి.

Personal Loan

ప్ర‌స్తుతం మ‌నం ఎలాంటి లోన్ తీసుకున్నా స‌రే.. 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు, ముంద‌స్తు చెల్లింపు, పాక్షిక చెల్లింపులు త‌దిత‌ర సేవల‌పై జీఎస్టీ ఉంటుంది. అయితే వ‌డ్డీ రేట్ల‌పై మాత్రం జీఎస్టీ లేదు. కానీ రుణ చెల్లింపుల‌ను ఆల‌స్యంగా చేసిన ప‌క్షంలో పడే ఫైన్‌కు జీఎస్‌టీ క‌ట్టాల్సి ఉంటుంది. ఇక లోన్‌ ప్రాసెసింగ్ ఫీజును బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌లు 0.5 శాతం నుంచి 3 శాతం వ‌ర‌కు వ‌సూలు చేస్తుంటాయి. దీనికి జీఎస్టీ అద‌నంగా ఉంటుంది. క‌నుక మీరు తీసుకునే వ్య‌క్తిగ‌త లోనుకు ప్రాసెసింగ్ ఫీజు ఎంత వ‌సూలు చేస్తున్నారో గ‌మ‌నించాలి. ఇది ఎంత త‌క్కువ ఉంటే అంత మంచిది. మీకు అందే రుణం నుంచి ప్రాసెసింగ్ ఫీజు తీసేస్తారు క‌నుక‌, ప్రాసెసింగ్ ఫీజు త‌క్కువ ఉంటే.. మీకు అందే రుణం ఎక్కువ‌గా ఉంటుంది. ఈ విష‌యాన్ని లోన్ తీసుకునే ముందు క‌చ్చితంగా గ‌మ‌నించాలి. చాలా వ‌ర‌కు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌లు మీరు ఎంత ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకున్నా స‌రే.. గ‌రిష్ట ప‌రిమితికి లోబ‌డే ప్రాసెసింగ్ ఫీజును తీసుకుంటాయి.

ఇక కొన్ని సంస్థ‌లు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే లోన్ల‌ను ఇస్తుంటాయి. క‌నుక అలాంటి సంస్థ‌ల నుంచి వ్య‌క్తిగ‌త రుణం తీసుకుంటే మంచిది. ఇక తీసుకున్న లోన్‌ను కాల ప‌రిమితి కాకున్నా ముందుగానే చెల్లించే స‌దుపాయాన్ని కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అందిస్తుంటాయి. ఈ క్ర‌మంలో చాలా వ‌ర‌కు సంస్థ‌లు 12 నెల‌ల వాయిదాల‌ను స‌రిగ్గా చెల్లించాకే ఈ స‌దుపాయాన్ని ఖాతాదారుల‌కు అందిస్తుంటాయి. అయితే ఇలాంటి సంద‌ర్భాల్లో మిగిలిన అస‌లుపై కొన్ని సంస్థ‌లు 5 శాతం వ‌ర‌కు రుసుంను వసూలు చేస్తుంటాయి. ఈ రుసుముపై 18 శాతం జీఎస్టీని కూడా విధిస్తారు. ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకునే ముందు ఈఎంఐ నెల‌కు ఎంత ఉంటుంది ? మ‌నం సంపాదించేది ఎంత ? ఎంత ఖ‌ర్చ‌వుతుంది ? ఈఎంఐకి మిగులుతుందా ? అనే విష‌యాల‌ను ఒక‌టికి రెండు సార్లు బేరీజు వేసుకున్నాకే ప‌ర్స‌న‌ల్ లోన్‌ను తీసుకోవ‌డం ఉత్త‌మం. దీంతో ఈఎంఐ చెల్లింపులను స‌కాలంలో చేయ‌వచ్చు. సిబిల్ స్కోరుపై ప్ర‌భావం ప‌డ‌కుండా ఉంటుంది. ఇక ఒక్క నెల ఈఎంఐ మిస్ అయినా రూ.450 నుంచి రూ.500 వ‌ర‌కు ఫైన్ ప‌డుతుంది. దీనిపై జీఎస్టీ అద‌నం. క‌నుక ఈఎంఐల‌ను స‌కాలంలో చెల్లిస్తే ఇలాంటి అప‌రాధ రుసుముల బెడ‌ద లేకుండా ఉండ‌వ‌చ్చు.

ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకున్నాక ఒక వేళ‌ అది మీకు అవ‌స‌రం లేద‌నుకోండి.. అప్పుడు ఆ లోన్‌ వ‌ద్ద‌నుకున్నా బ్యాంకుల‌కు కొంత రుసుం చెల్లించాలి. చాలా వ‌ర‌కు సంస్థ‌లు రూ.3వేల వ‌రకు ఇలాంటి రుసుంను వ‌సూలు చేస్తున్నాయి. ఇక ఇవే కాకుండా డాక్యుమెంటేష‌న్, స్టాంపు ఫీజుల‌ను అద‌నంగా చెల్లించాలి. అలాగే రుణానికి బీమా కూడా తీసుకోవాలి. క‌నుక ఇన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నాకే ప‌ర్స‌న‌ల్ లోన్‌కు అప్లై చేయ‌డం బెట‌ర్‌. అలాగే ఒకేసారి ఎక్కువ ఫైనాన్స్ సంస్థ‌ల‌కు అప్లికేష‌న్లు కూడా పెట్ట‌వ‌ద్దు. ఎందుకంటే.. అది సిబిల్ స్కోరుపై ప్ర‌భావం చూపుతుంది. అలాగే ఎక్కువ లోన్లు మంజూరు అయితే.. వాటి ఈఎంఐల‌ను చెల్లించ‌డం చాలా క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. క‌నుక ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకునే ముందు పైన చెప్పిన అన్ని అంశాల‌ను ఒక‌సారి ప‌రిశీలించి లోన్‌కు అప్లై చేయాలి. లేదంటే న‌ష్టపోవాల్సి వ‌స్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఐపీఎల్ 2026 ప్రారంభంలో మార్పు.. కొత్త తేదీ ఇదే! క్లారిటీ వచ్చేది అప్పుడే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ రెండు రోజులు ఆల‌స్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే స‌మాధానం…

Friday, 27 February 2026, 10:00 PM

విజయ్‌కు భార్య సంగీత విడాకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు!

త‌మిళ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్‌తో విడాకులు కావాల‌ని కోరుతూ ఆయ‌న భార్య సంగీత కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు…

Friday, 27 February 2026, 9:23 PM

క్రికెటర్ కాదు.. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నా: జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను మొద‌ట్లో క్రికెట‌ర్ అవుతాన‌ని అనుకోలేద‌ని, భార‌త ఆర్మీలో చేరి సేవ‌లందించాల‌ని చిన్న‌త‌నం నుంచే క‌ల‌లు క‌న్నాన‌ని, కానీ క్రికెట్‌లోకి…

Friday, 27 February 2026, 5:16 PM

మోదీకి ‘విరోష్’ వెడ్డింగ్ ఇన్విటేషన్.. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్!

మార్చి 4, 2026న హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న త‌మ వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని నూత‌న…

Friday, 27 February 2026, 2:58 PM

ఒక్కటైన విజయ్-రష్మిక.. ఉదయ్‌పూర్‌లో వైభవంగా ‘విరోష్’ వివాహం!

టాలీవుడ్ న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌య్యారు. గురువారం (ఫిబ్ర‌వ‌రి 26, 2026) రాజ‌స్థాన్‌లోని…

Thursday, 26 February 2026, 9:41 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ ఓటీటీ డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ అన్ని కోట్లా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాస్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీకి గాను…

Thursday, 26 February 2026, 6:59 PM

శ్రీలంక ఆటగాళ్లకు ప్రాణగండం? రక్షణ కల్పించాలని కెప్టెన్ శనక వేడుకోలు!

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీ సూప‌ర్ 8 ద‌శ‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌ను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన…

Thursday, 26 February 2026, 5:01 PM

టాలీవుడ్‌లో కొత్త రూల్.. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమా..?

కొత్త‌గా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా స‌రే క‌చ్చితంగా 8 వారాల త‌రువాతే ఓటీటీలోకి రావాల‌న్న నిబంధ‌న‌పై ప్ర‌స్తుతం…

Thursday, 26 February 2026, 1:20 PM