lifestyle

Perfume : ప‌ర్‌ఫ్యూమ్ మీ శ‌రీరంపై ఎక్కువ గంట‌లపాటు ఉండాలంటే.. ఈ టిప్స్‌ను పాటించండి..!

Perfume : మ‌నం ఎండ‌లో బ‌య‌ట తిరిగితే శ‌రీరంపై చెమ‌ట వ‌స్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. చెమ‌ట వ‌ల్ల శ‌రీరం నుంచి దుర్గంధం కూడా వ‌స్తుంటుంది. దీంతో ఆ చెడు వాస‌న ఇత‌రుల‌కు రాకుండా ఉండేందుకు గాను మ‌నం పెర్‌ఫ్యూంలను వాడుతుంటాం. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల పెర్‌ఫ్యూంలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ పెర్‌ఫ్యూం అయినా స‌రే.. చాలా త‌క్కువ స‌మ‌యం పాటు మాత్ర‌మే మ‌న శ‌రీరంపై ఉంటుంది. కొన్ని గంట‌లు అయ్యాక పెర్‌ఫ్యూం వాస‌న పోతుంది. అయితే పెర్‌ఫ్యూం వాస‌న త్వ‌ర‌గా పోకుండా ఎన్ని గంట‌ల పాటు అయినా అలాగే ఉండేందుకు ప‌లు చిట్కాల‌ను పాటించాలి. అవేమిటంటే..

శ‌రీరంపై మీరు పెర్‌ఫ్యూం స్ప్రే చేసుకునే భాగాల్లో పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి. దీంతో పెర్‌ఫ్యూం ఎక్కువ సేపు శ‌రీరంపై ఉంటుంది. చ‌ర్మంపై పెర్‌ఫ్యూం స్ప్రే చేసుకునే ముందు మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేయాలి. చ‌ర్మానికి మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేయ‌డం వ‌ల్ల శ‌రీరం మృదువుగా, జిడ్డుగా మారుతుంది. దీంతో పెర్‌ఫ్యూం వాస‌న ఎక్కువ సేపు ఉంటుంది. ఒక చేయి మ‌ణిక‌ట్టును మ‌రొక చేయి మ‌ణిక‌ట్టుతో రుద్ద రాదు. దీని వ‌ల్ల పెర్‌ఫ్యూం త్వ‌ర‌గా పోతుంది. పెర్‌ఫ్యూంలో కాట‌న్ బ‌డ్స్‌ను ముంచి వెంట తీసుకెళ్తే.. రోజులో ఎప్పుడైనా పెర్‌ఫ్యూం వాస‌న పోతే అప్పుడు ఆ కాట‌న్ బ‌డ్స్‌ను శ‌రీరంపై ట‌చ‌ప్ చేసుకోవాలి. దీంతో వాటిలో ఉండే పెర్‌ఫ్యూం శ‌రీరానికి అప్లై అవుతుంది. ఫ‌లితంగా పెర్‌ఫ్యూం వాస‌న‌ను తిరిగి పొంద‌వ‌చ్చు.

Perfume

పెర్‌ఫ్యూం స్ప్రే చేసుకునేట‌ప్పుడు బాటిల్‌ను షేక్ చేయ‌రాదు. అలా చేస్తే పెర్‌ఫ్యూం శ‌రీరానికి స‌రిగ్గా అప్లై అవ్వ‌దు. దీంతో పెర్‌ఫ్యూం త్వ‌ర‌గా పోతుంది. క‌నుక పెర్‌ఫ్యూం స్ప్రే చేసేట‌ప్పుడు బాటిల్‌ను నిల‌క‌డ‌గా ప‌ట్టుకోవాలి. పెర్‌ఫ్యూం బాటిల్‌పై లైట్ లేదా సూర్య కాంతి నేరుగా ప‌డ‌కుండా చూసుకోవాలి. కాంతి ప‌డితే పెర్‌ఫ్యూం త్వ‌ర‌గా వాస‌న‌ను కోల్పోతుంది. అలాంటి పెర్‌ఫ్యూంను వాడినా ఫ‌లితం ఉండ‌దు. క‌నుక కాంతి ప‌డ‌ని ప్ర‌దేశాల్లో పెర్‌ఫ్యూం బాటిల్స్‌ను ఉంచాలి. శ‌రీరంపై పెర్‌ఫ్యూం స్ప్రే చేశాక కొంత సేపు వెయిట్ చేసి దుస్తులు వేసుకుంటే పెర్‌ఫ్యూం వాస‌న చాలా సేపు ఉంటుంది. పెర్‌ఫ్యూంల‌ను ఎప్పుడూ బెడ్‌రూంలో కాంతి ప‌డ‌ని ప్ర‌దేశంలో ఉంచాలి. బాత్‌రూంలో పెడితే తేమ వ‌ల్ల పెర్‌ఫ్యూం త్వ‌ర‌గా వాస‌న‌ను కోల్పోతుంది. ఆ త‌రువాత దాన్ని వాడినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM