lifestyle

Mutton Dal Ghosht : మ‌ట‌న్‌, ప‌ప్పు క‌లిపి ఇలా కూర వండి తినండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Mutton Dal Ghosht : మ‌ట‌న్‌, ప‌ప్పు దినుసులు.. రెండింటిలోనూ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటిలో దేన్ని తిన్నా మ‌న‌కు ప్రోటీన్లు అందుతాయి. శ‌రీర నిర్మాణం జ‌రుగుతుంది. అయితే ఈ రెండింటినీ క‌లిపి వండుకుని కూడా తిన‌వచ్చు. దీంతో మ‌న శ‌రీరానికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది. పిల్ల‌ల‌కు అయితే ఇలా మ‌ట‌న్‌, ప‌ప్పు రెండింటినీ క‌లిపి వండి పెడితే వారికి బాగా బ‌లం వ‌స్తుంది. అన్ని అంశాల్లోనూ రాణిస్తారు. ఈ క్ర‌మంలోనే మ‌ట‌న్‌, పప్పు దినుసులు రెండింటినీ క‌లిపి చేసే మ‌ట‌న్ దాల్ ఘోష్త్‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

మ‌ట‌న్ దాల్ ఘోష్త్‌ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మసూర్‌దాల్ – కప్పు, బోన్‌లెస్‌ మటన్ – 1 కిలో, ఉప్పు – త‌గినంత, కారం – త‌గినంత, నూనె – 4 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు – 2, అల్లం ముద్ద – 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి – 1 టీస్పూను, ధ‌నియాల పొడి – 1 టీస్పూను, పసుపు – 1/2 టీస్పూను, గరం మసాలా – 1 టీస్పూను, నిమ్మకాయ – 1, కొత్తిమీర తురుము – అలంకరణ కోసం.

Mutton Dal Ghosht

మ‌ట‌న్ దాల్ ఘోష్త్‌ త‌యారు చేసే విధానం..

ప్రెష‌ర్ కుక్క‌ర్ తీసుకుని అందులో మ‌ట‌న్ ముక్క‌లు, ప‌ప్పు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయ‌ల‌ను వేసి వాటిని గోల్డ్ క‌ల‌ర్‌లోకి వ‌చ్చేంత వ‌ర‌కు బాగా వేపుకోవాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి ముద్ద‌ల‌ను కూడా వేసి ఒక నిమిషం పాటు బాగా వేపుకోవాలి. అనంత‌రం అందులో ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర‌పొడి, కారం, గ‌రం మ‌సాలా వేసి నూనె తేలే వ‌ర‌కు వేయించుకోవాలి. అనంత‌రం అందులో ప‌ప్పు, మ‌ట‌న్ ముక్క‌ల మిశ్ర‌మం క‌లిపి 10 నిమిషాల పాటు స్ట‌వ్‌ను సిమ్‌లో ఉంచి బాగా ఉడికించాలి. అనంత‌రం నిమ్మ‌ర‌సం పిండి పైన కొత్తిమీర‌తో అలంక‌రించుకోవాలి. దీంతో ఘుమ ఘుమ‌లాడే మ‌ట‌న్ దాల్ ఘోష్త్ త‌యార‌వుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీలలో తిన‌వ‌చ్చు. భ‌లే రుచిగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM