Exercises For Eye Sight : కంటి చూపును మెరుగు పరుచుకోవాలంటే.. సహజంగానే ఎవరైనా సరే.. విటమిన్ ఎ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే దాంతోపాటు త్రాటక అనే ఓ యోగా ప్రక్రియ కూడా మనకు అందుబాటులో ఉంది. నిజానికి ఇది ఒక వ్యాయామం. దీంతో మన కంటి చూపు మెరుగుపడుతుంది. అయితే దీన్ని ఎలా చేయాలో, దాంతో మనకు ఇంకా ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అరచేతి సైజులో ఉండే ఒక ఆకుని తీసుకుని అందులో నల్లని వృత్తాన్ని గీయాలి. అనంతరం ఆ ఆకును గోడకు అతికించాలి. దాని ఎదురుగా 2 అడుగుల దూరంలో కూర్చుని అదే ఆకును 5 నుంచి 10 నిమిషాల పాటు తీక్షణంగా చూడాలి. ఈ వ్యాయామాన్ని ఉదయం, సాయంత్రం చేయాలి. అయితే ఆకును చూసే సమయంలో కళ్లను ఆర్పకూడదు. తెరిచే ఉంచాలి.
చీకటి గదిలో ఒక క్యాండిల్‌ను వెలిగించి దానిపైపే కన్నార్పకుండా 5 నుంచి 10 నిమిషాల పాటు చూడాలి. ఈ వ్యాయామాన్ని కూడా నిత్యం ఉదయం, సాయంత్రం చేయాలి. కళ్లు తెరిచి చూసినా ఏమీ కనిపించని చీకటి గదిలో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉండాలి. కళ్లు తెరిచే చీకటిని గమనించాలి. కన్నార్పకూడదు. ఈ వ్యాయామాన్ని నిత్యం ఒక్కసారి చేస్తే చాలు. పచ్చని ప్రకృతిలో కూర్చుని నీలంగా ఉన్న ఆకాశం వైపు కన్నార్పకుండా 5 నుంచి 10 నిమిషాల పాటు చూడాలి. ఈ వ్యాయామాన్ని నిత్యం ఒక్కసారి చేయాలి.
మీకు నచ్చిన వ్యక్తులు లేదా మీకిష్టమైన దేవుడు/దేవత ఫొటోగానీ, ఏదైనా ఒక క్రిస్టల్, పెద్దదైన పువ్వు లేదా సూదిలోకి దారం ఎక్కించే మొనను గానీ తదేకంగా 5 నుంచి 10 నిమిషాల పాటు నిత్యం చూడాలి. ఆ వస్తువుకు, మీకు మధ్య 2 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. వాటిని చూసేటప్పుడు కన్నార్పకూడదు. ఈ వ్యాయామాన్ని కూడా నిత్యం ఒక్కసారి చేస్తే చాలు. ఇప్పుడు చెప్పిన విధంగా వ్యాయామాలు చేయడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. ఏకాగ్రత అలవడుతుంది. ఏదైనా పనిచేసేటప్పుడు కావల్సిన ఏకాగ్రత లభిస్తుంది. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. చిన్నారుల్లో జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి పెరుగుతాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…