Brinjal : వంకాయ.. ఆంగ్లంలో దీన్నే ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇది మనకు రక రకాల సైజ్‌లలో రక రకాల కలర్లలో లభిస్తుంది. కొన్ని వంకాయలు గుండ్రంగా పొట్టిగా ఉంటే.. కొన్ని పొడుగ్గా ఉంటాయి. ఇంకా కొన్ని వంకాయలు తెల్లగా ఉంటే కొన్ని పర్పుల్ కలర్‌లో ఉంటాయి. అయితే ఇతర అన్ని కూరగాయల్లాగే వంకాయల ద్వారా కూడా మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మరి వంకాయల ద్వారా మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
వంకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. అలాగే శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వంకాయల్లో ఉండే ఆంథోసయనిన్స్ గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే వంకాయల్లో ఉండే నాసునిన్ అనే సమ్మేళనం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. వంకాయల్లో పాస్ఫరస్, ఐరన్, కాల్షియం, విటమిన్ బి1, బి2, బి3, బి6లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల జీర్ణవ్యవస్థలో ఏవైనా సమస్యలు ఉంటే పోతాయి. అలాగే మూత్రాశయ సమస్యలు కూడా తగ్గుతాయి. వంకాయ తొక్కలో ఫైబర్, పొటాషియం, మెగ్నిషియంలు పుష్కలంగా ఉంటాయి. దీంతో మన శరీరానికి పోషణ లభిస్తుంది.
వంకాయలను తరచూ తింటే రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లు, ఎల్‌డీఎల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వంకాయల్లో ఉండే పాలీఫినాల్స్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. అందువల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. వంకాయలను రెగ్యులర్‌గా తింటే హైబీపీ తగ్గుతుంది. అలాగే అల్సర్లు ఉన్నా పోతాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్‌లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్‌లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్‌లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…