Brinjal : వంకాయ‌ల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలిస్తే వెంట‌నే తిన‌డం మొద‌లుపెడ‌తారు..!

January 25, 2024 2:46 PM

Brinjal : వంకాయ‌.. ఆంగ్లంలో దీన్నే ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇది మ‌న‌కు ర‌క ర‌కాల సైజ్‌ల‌లో ర‌క ర‌కాల క‌ల‌ర్ల‌లో ల‌భిస్తుంది. కొన్ని వంకాయ‌లు గుండ్రంగా పొట్టిగా ఉంటే.. కొన్ని పొడుగ్గా ఉంటాయి. ఇంకా కొన్ని వంకాయ‌లు తెల్ల‌గా ఉంటే కొన్ని ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉంటాయి. అయితే ఇత‌ర అన్ని కూర‌గాయ‌ల్లాగే వంకాయల ద్వారా కూడా మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌రి వంకాయల ద్వారా మ‌న‌కు క‌లిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

వంకాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకుంటాయి. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. వంకాయ‌ల్లో ఉండే ఆంథోస‌య‌నిన్స్ గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి. అలాగే వంకాయ‌ల్లో ఉండే నాసునిన్ అనే స‌మ్మేళ‌నం ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. వంకాయ‌ల్లో పాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్‌, కాల్షియం, విట‌మిన్ బి1, బి2, బి3, బి6లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే పోతాయి. అలాగే మూత్రాశ‌య స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. వంకాయ తొక్క‌లో ఫైబ‌ర్‌, పొటాషియం, మెగ్నిషియంలు పుష్క‌లంగా ఉంటాయి. దీంతో మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది.

Brinjal many wonderful health benefits
Brinjal

వంకాయ‌లను త‌ర‌చూ తింటే ర‌క్తంలో ఉండే ట్రై గ్లిజ‌రైడ్లు, ఎల్‌డీఎల్ స్థాయిలు త‌గ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వంకాయ‌ల్లో ఉండే పాలీఫినాల్స్ ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. అందువ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. వంకాయ‌ల‌ను రెగ్యుల‌ర్‌గా తింటే హైబీపీ త‌గ్గుతుంది. అలాగే అల్స‌ర్లు ఉన్నా పోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now