ఉద్యోగాలు

మ‌చిలీప‌ట్నం BELలో ఉద్యోగాలు.. నెల‌కు రూ.50వేలు జీతం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌చిలీప‌ట్నంలో ఉఏన్న భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ సంస్థ‌లో ఖాళీగా ఉన్న జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. బీకామ్‌, బీబీఏ, బీబీఎం వంటి డిగ్రీలు చ‌దివిన వారు కంప్యూట‌ర్స్‌పై మంచి ప‌ట్టు ఉంటే ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారు ఏపీలో ఉన్న మ‌చిలీప‌ట్నం BELలో ప‌నిచేయాల్సి ఉంటుంది. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుంచి 28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో 10 ఏళ్ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఉంటాయి.

ఈ పోస్టుల‌కు గాను ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం అయింది. ఇందుకు గాను ఫిబ్ర‌వ‌రి 21ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. రాత ప‌రీక్ష‌ను మార్చి 16వ తేదీన నిర్వ‌హిస్తారు. ఇందులో మొత్తం 150 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఆప్టిట్యూట్‌, రీజ‌నింగ్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌లో 50 మార్కుల‌కు ప్ర‌శ్న‌లు ఉంటాయి. టెక్నిక‌ల్ నాలెడ్జ్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై 100 మార్కులు ఉంటాయి. ఈ టెస్టులో పాస్ అయిన వారికి జూనియ‌ర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇస్తారు.

జ‌న‌ర‌ల్‌, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థులు రూ.295 అప్లికేష‌న్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి అప్లికేష‌న్ ఫీజు లేదు. అప్లికేష‌న్ ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.50వేల నుంచి జీతం మొద‌ల‌వుతుంది. అలాగే డీఏ, హెచ్ఆర్ఏ, పీఎఫ్‌, పెన్ష‌న్‌, గ్రాట్యుటీ స‌దుపాయాన్ని అందిస్తారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు, ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు https://bel-india.in/job-notifications అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM