ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖలలో పలు విభాగాల్లో పనిచేయడానికి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు బ్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) సహకారంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వారు భారీగా ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగా మొత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు గాను అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వయస్సు 35 ఏళ్లకు మించకూడదని నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యతను ఇస్తారు.
ఈ పోస్టులకు గాను అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ టెస్ట్ రాయాలి. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశంలోని పలు ప్రధాన నగరాలు, పట్టణాల్లో పనిచేయాల్సి ఉంటుంది. రాత పరీక్షలకు గాను హైదరాబాద్, వైజాగ్, దిల్లీ, అహ్మదాబాద్, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్, ముంబై, పుణె, అమృత్ సర్, జయపుర, లక్నో, కోల్‌కతాలలో సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఫిబ్రవరి 7ని చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్షను ఆన్ లైన్‌లో మార్చి నెలలో నిర్వహిస్తారు. మరింత సమాచారం కోసం https://www.hdfcbank.com/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.3 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు చెల్లించనున్నారు.
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…