
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ కార్యక్రమానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు. చదువు పూర్తిచేసిన తర్వాత ప్రభుత్వ సంస్థలో అనుభవం సంపాదించాలనుకునే యువతకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ నియామకాలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఈమెయిల్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని స్కాన్ చేసి నిర్ణీత ఈమెయిల్ ఐడీ (hrd.issa@gov.in)కి పంపాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఫిబ్రవరి 27, 2026. ఈ తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
మొత్తం ఖాళీలు – 21..
ISSA విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 2021 నుంచి 2025 మధ్య అర్హత పరీక్ష పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ అవకాశం ఉంది. వివిధ విభాగాల వారీగా ఖాళీలను కేటాయించారు.
అందుబాటులో ఉన్న పోస్టులు:
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – 15
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (గణితం/గణాంకాలు) – 1
- టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా – కంప్యూటర్ సైన్స్) – 5
నెలవారీ స్టైపెండ్:
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: నెలకు రూ. 12,300
- టెక్నీషియన్ అప్రెంటిస్: నెలకు రూ. 10,900
అర్హత ప్రమాణాలు:
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పూర్తి కాల బీఈ/బీటెక్ డిగ్రీని ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణతతో పొంది ఉండాలి.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (గణితం/గణాంకాలు) కోసం పూర్తి కాల ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్) డిగ్రీ ఫస్ట్ డివిజన్‌తో అవసరం ఉంటుంది.
- టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి కంప్యూటర్ సైన్స్ డిప్లొమా పూర్తి కాల విధానంలో ఉండాలి.
నియమాలు:
2021 నుంచి 2025 మధ్య అర్హత పరీక్ష ఉత్తీర్ణులైనవారే దరఖాస్తు చేయాలి. ఇప్పటికే అప్రెంటీసెస్ యాక్ట్-1961 కింద శిక్షణ పూర్తి చేసినవారు లేదా ప్రస్తుతం శిక్షణ పొందుతున్నవారు అర్హులు కారు. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ పని అనుభవం ఉన్నవారికి కూడా ఈ అవకాశం లేదు.
దరఖాస్తు విధానం:
- అధికారిక నోటిఫికేషన్ (ISSA/HRD/Apprentice/2026/01) నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేయాలి
- ఫారాన్ని జాగ్రత్తగా పూర్తి చేయాలి
- అవసరమైన సర్టిఫికెట్లను స్వయంసాక్ష్యంతో స్కాన్ చేయాలి
- ఫారంతో పాటు డాక్యుమెంట్లను నిర్ణీత ఈమెయిల్(hrd.issa@gov.in)కు పంపాలి
- ఫిబ్రవరి 27, 2026లోపు దరఖాస్తు పూర్తయ్యేలా చూసుకోవాలి
ఈ నియామకాలు యువ అభ్యర్థులకు డీఆర్డీఓ వంటి కీలక సంస్థలో శిక్షణ పొందే అరుదైన అవకాశంగా నిలవనున్నాయి.
గమనిక: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లేదా వెబ్సైట్ (drdo.gov.in/drdo/en)ను సందర్శించి సమాచారాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.








