మంగళవారం, జూలై 21, 2026
ముఖ్య‌మైన‌వి

ఫెవికాల్‌ డబ్బాలో ఉండే గమ్‌ లోపల డబ్బాకు ఎందుకు అతుక్కోదు ? కారణం తెలుసా ?

ఫెవికాల్‌ గమ్‌ తెలుసు కదా. ఒకప్పుడు యాడ్స్‌ ద్వారానే ఈ కంపెనీ బాగా పాపులర్‌ అయింది. ఫెవికాల్‌ గమ్‌ అంటే అంత ప్రాముఖ్యత ఉండేది. ఆ గమ్‌ తెల్లగా ఉంటుంది. డబ్బాల్లో విక్రయిస్తారు. అయితే డబ్బాల్లో ఉండే ఆ…

ఫెవికాల్‌ డబ్బాలో ఉండే గమ్‌ లోపల డబ్బాకు ఎందుకు అతుక్కోదు ? కారణం తెలుసా ?

ఫెవికాల్‌ గమ్‌ తెలుసు కదా. ఒకప్పుడు యాడ్స్‌ ద్వారానే ఈ కంపెనీ బాగా పాపులర్‌ అయింది. ఫెవికాల్‌ గమ్‌ అంటే అంత ప్రాముఖ్యత ఉండేది. ఆ గమ్‌ తెల్లగా ఉంటుంది. డబ్బాల్లో విక్రయిస్తారు. అయితే డబ్బాల్లో ఉండే ఆ గమ్‌ డబ్బాకు ఎందుకు అతుక్కోదు ? దాన్ని బయటకు తీసి వాడితేనే ఎందుకు అతుక్కుంటుంది ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

why fevicol in plastic box does not stick to box

ఫెవికాల్‌ వంటి గమ్‌ల తయారీలో పాలిమర్‌లను ఉపయోగిస్తారు. ఆ గమ్‌లో కొంత శాతం నీరు ఉంటుంది. అందువల్లే గమ్‌ ద్రవ రూపంలో ఉంటుంది. అయితే ఆ గమ్‌ను బయటకు తీసి దేనిపై అయినా రాస్తే అందులో ఉండే నీరు ఆవిరవుతుంది. దీంతో గమ్‌ గట్టిపడుతుంది. తరువాత అది రాయబడిన ఉపరితలానికి అంటుకుంటుంది. ఇలా గమ్‌ పనిచేస్తుంది.

అయితే గమ్‌ డబ్బాలో ఉన్నప్పుడు మూత పెట్టి ఉంటాం కదా. కనుక అందులో ఉండే నీరు ఆవిరై పోదు. అలాగే ఉంటుంది. దీంతో గమ్‌ ఎప్పుడూ అలా ద్రవ రూపంలోనే ఉంటుంది. అందువల్లే ఆ గమ్‌ డబ్బాకు అంటుకోదు. ఇదీ.. అసలు విషయం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి