రూ.2 కోట్లతో గణపతి ఆలయం నిర్మించిన.. క్రైస్తవ వ్యాపారి!

July 23, 2021 8:31 PM

అతను ఒక క్రైస్తవుడు.. అయినప్పటికీ హిందూ దేవుడైన గణపతికి ఆలయం కట్టాలని భావించాడు. ఈ క్రమంలోనే ఏకంగా రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసే గణపతి ఆలయాన్ని నిర్మించాలని భావించాడు. మతాలు వేరైనా భగవంతుడు ఒక్కడేనని చాటి చెబుతున్న ఈ ఘటన కర్ణాటక, ఉడిపి జిల్లా శిర్వాలో చోటుచేసుకుంది.

గాబ్రియేల్ ఎఫ్ నజరేత్ అనే వ్యాపారి పదవ తరగతి పూర్తి చేసి ఆ తర్వాత ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో తిరిగి చివరికి ముంబైలో వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తన వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో తన సొంత ఊరిలో వినాయకుడి ఆలయం నిర్మించాలని భావించాడు.

బ్లాక్స్, మౌల్డ్స్ తయారీ సంస్థను ఏర్పాటు చేసిన గాబ్రియేల్ ఏసుప్రభుతో పాటు వినాయకుడిని కూడా ఎంతో నమ్మేవాడు. ఈ క్రమంలోనే తన సొంతూరిలో అమ్మాని రామన్న శెట్టి మెమోరియల్ హాల్‌లోని గణపతి ఆలయమంటే తనకెంతో ఇష్టమని అచ్చం ఆలయం తరహాలోనే మరొక ఆలయం నిర్మించాలని భావించినట్లు గాబ్రియెల్ స్నేహితుడు పుండలిక తెలిపారు. ఈ క్రమంలోనే ఈ ఆలయంలో ముప్పై ఆరు ఇంచుల వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ఈ ఆలయంలో స్వామివారికి పూజలు చేయడానికి ప్రత్యేక పూజారినీ నియమించి అతనికి వసతి కల్పించడానికి మరొక ఇంటిని కూడా నిర్మించారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆలయ నిర్మాణం వాయిదా పడినప్పటికీ గత వారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, బ్రహ్మ కలశోత్సవం నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలను ముగ్గురు సభ్యులు కమిటీ నిర్వహించనుంది. ఈ విధంగా ఒక క్రైస్తవుడు వినాయకుడి ఆలయం నిర్మిస్తున్న విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment