శనివారం, జూలై 18, 2026
ముఖ్య‌మైన‌వి

Surgeons In Clothes : ఆపరేషన్లు చేసే డాక్టర్లు గ్రీన్, బ్లూ కలర్ డ్రెస్సులనే ఎందుకు ధరిస్తారు..?

Surgeons In Clothes : స్కూల్స్, కాలేజీలకు వెళ్లినప్పుడు యూనిఫాం.. ఆఫీసులకు వెళ్తే ఫార్మల్ డ్రెస్సులు.. ఫంక్షన్లకు వెళ్తే పార్టీ వేర్.. ఇంటి దగ్గర ఉంటే సాధారణ డ్రెస్సులు.. రాత్రిపూట నైట్ డ్రెస్.. ఇలా మనం ధరించే దుస్తులు…

Surgeons In Clothes : ఆపరేషన్లు చేసే డాక్టర్లు గ్రీన్, బ్లూ కలర్ డ్రెస్సులనే ఎందుకు ధరిస్తారు..?

Surgeons In Clothes : స్కూల్స్, కాలేజీలకు వెళ్లినప్పుడు యూనిఫాం.. ఆఫీసులకు వెళ్తే ఫార్మల్ డ్రెస్సులు.. ఫంక్షన్లకు వెళ్తే పార్టీ వేర్.. ఇంటి దగ్గర ఉంటే సాధారణ డ్రెస్సులు.. రాత్రిపూట నైట్ డ్రెస్.. ఇలా మనం ధరించే దుస్తులు ఆయా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే హాస్పిటల్‌ల‌లో వైద్యులు ధరించే దుస్తులు మాత్రం తెల్లగా ఉంటాయి. అదే వారు ఆపరేషన్ వంటివి చేస్తే ఆకుపచ్చ లేదా నీలం రంగుతో కూడిన దుస్తులు ధరిస్తారు. ఎందుకు..? తెలుసుకుందాం రండి. మామూలు సందర్భాల్లో అయితే హాస్పిటల్స్‌లో డాక్టర్లు తెల్ల రంగు వస్ర్తాలనే ధరిస్తారు. ఎందుకంటే తెలుపు స్వచ్ఛతకు, శుభ్రతకు సంకేతం కాబట్టి, వారు కూడా అదే విధంగా ఉండాలి కాబట్టి. తెల్ల రంగు బట్టలను ధరిస్తారు.

అయితే ఆపరేషన్లు చేసే సమయంలో మాత్రం గ్రీన్ లేదా బ్లూ కలర్ వస్ర్తాలు ధరిస్తారు. కానీ ఇదేమీ కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. 20వ శతాబ్దం ఆరంభంలో ఓ వైద్యుడు ఈ విధానాన్ని ప్రారంభించాడు. ఈ విధానం ప్రకారం డాక్టర్లు ఆపరేషన్ సమయంలో గ్రీన్ లేదా బ్లూ కలర్ దుస్తులు ధరించాలి. అలా చేస్తే ఎరుపు రంగులో ఉండే పేషెంట్ అవయవాలను, వాటి రంగులు, మార్పులను సులభంగా పసిగట్టవచ్చట. సాధారణంగా ఆపరేషన్లు చేసే వైద్యులు ఎక్కువ సేపు రక్తాన్ని, ఎరుపు రంగును చూస్తారు. కాబట్టి ఈ రంగును చూసిన తరువాత మిగతా రంగులను గుర్తించడం కొంత కష్టతరమవుతుందట. ఈ క్రమంలో తెలుపు రంగు బట్టలు వేసుకుని ఉంటే ఆ వైద్యులకు ఆకుపచ్చని రంగు కలిగిన గీతలు భ్ర‌మ‌ రూపంలో పదే పదే కనిపిస్తాయట.

Surgeons In Clothes why they wear green or blue color ones
Surgeons In Clothes

దీన్ని నివారించడం కోసం వైద్యులు ఆకుపచ్చని వస్ర్తాలను ఎక్కువగా ధరిస్తారట. దీంతో వారికి కనిపించే ఆకుపచ్చని గీతలు ఆ డ్రెస్‌లో కలిసిపోయి కంటికి ఇతర రంగులు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే నీలి రంగు వస్ర్తాలు ధరించినా ఈ సమస్య నుంచి బయట పడవచ్చట. ఎరుపు రంగును ఎక్కువ సేపు చూస్తే మెదడులో రంగులను గుర్తించే సంకేతాలు బలహీనమవుతాయట. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్లు తాము వేసుకున్న ఆకుపచ్చ, నీలం రంగు బట్టలను మధ్య మధ్యలో చూసేందుకు గాను ఈ విధానాన్ని కనుగొన్నారు. ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ పడోవాలో విజువల్ ఇల్యూషన్స్ అనే అంశంపై పరిశోధనలు చేస్తున్న పౌలా బ్రెస్సాన్ అనే శాస్త్రవేత్త కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించి చెబుతున్నారు. సో, ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు గ్రీన్, బ్లూ కలర్ బట్టలు ఎందుకు వేసుకుంటారో తెలిసింది కదా..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి