శనివారం, జూన్ 13, 2026
ముఖ్య‌మైన‌వి

కారును అమ్మి ఆక్సిజన్‌ సిలిండర్‌లను సరఫరా చేస్తున్నాడు.. కోవిడ్‌ బాధితులను రక్షిస్తున్నాడు..!

కరోనా నేపథ్యంలో ఆక్సిజన్‌ సిలిండర్లకు ఎంతటి ప్రాధాన్యత ఏర్పడిందో అందరికీ తెలిసిందే. కోవిడ్‌ బాధితులు ఆక్సిజన్‌ సిలిండర్లు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. అయితే అలాంటి వారికి నేనున్నాని ఆ వ్యక్తి అండగా నిలబడుతున్నాడు. అతనే ముంబైకి చెందిన…

కారును అమ్మి ఆక్సిజన్‌ సిలిండర్‌లను సరఫరా చేస్తున్నాడు.. కోవిడ్‌ బాధితులను రక్షిస్తున్నాడు..!

కరోనా నేపథ్యంలో ఆక్సిజన్‌ సిలిండర్లకు ఎంతటి ప్రాధాన్యత ఏర్పడిందో అందరికీ తెలిసిందే. కోవిడ్‌ బాధితులు ఆక్సిజన్‌ సిలిండర్లు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. అయితే అలాంటి వారికి నేనున్నాని ఆ వ్యక్తి అండగా నిలబడుతున్నాడు. అతనే ముంబైకి చెందిన షానవాజ్‌ షేక్‌. ముంబైలోని మల్వాని అనే ప్రాంతంలో నివాసం ఉండే షానవాజ్‌ షేక్‌ గతేడాది కరోనా సమయంలో తన వద్ద ఉన్న ఎస్‌యూవీ కారును అమ్మి అవసరం ఉన్నవారికి ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేశాడు. అయితే ప్రస్తుతం కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా అతను తన సేవను కొనసాగిస్తున్నాడు.

shahnawaz shaikh mumbai man free oxygen cylinders

గత ఏడాది కోవిడ్‌ సమయంలో అతను సుమారుగా 6000 మందికి ఆక్సిజన్‌ సిలిండర్లను అందజేశాడు. ఇక ప్రస్తుతం రోజూ అతనికి 50 ఫోన్‌ కాల్స్‌ వస్తున్నారు. దీంతో రోజుకు 500 మందికి సిలిండర్లను అందజేస్తున్నాడు. గతేడాది కోవిడ్‌ వల్ల తన స్నేహితుడు ఆక్సిజన్‌ అందక చనిపోయాడు. అప్పటి నుంచి షానవాజ్‌ షేక్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో భాగంగానే గతేడాది ఎంతో మందికి సేవ చేశాడు. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాడు.

ఇక షానవాజ్‌ షేక్‌ చేస్తున్న సేవకు అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. నెటిజన్లు అతని సేవను మెచ్చుకుంటున్నారు. సొంత కారును కూడా అమ్మేసి కోవిడ్‌ బాధితులకు సేవ చేస్తుండడం నిజంగా అభినందనీయమని నెటిజన్లు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి