దారుణం.. ఆడ‌పిల్ల పుట్టింద‌ని అత్తింటి వేధింపులు.. 3 నెల‌ల ప‌సికందును చంపేసిన త‌ల్లి..

December 3, 2021 1:29 PM

ముంబైలో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆడ‌పిల్ల పుట్టింద‌ని అత్తింటి వారు త‌ర‌చూ వేధింపుల‌కు గురి చేస్తుండ‌డంతో.. ఆ మ‌హిళ త‌న 3 నెల‌ల ప‌సికందును చంపేసింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

woman killed her 3 months old baby

ముంబైలోని కాలాచౌకీ ప్రాంతంలో ఉన్న సంఘ‌ర్ష్ స‌ద‌న్ బిల్డింగ్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన 36 ఏళ్ల మ‌హిళ‌కు కుటుంబ స‌భ్యులు ఇప్ప‌టికే 3 సార్లు అబార్ష‌న్ చేశారు. ఆమెకు ఆడ‌పిల్ల పుడుతుంద‌ని అంజ‌నం వేసిన మాంత్రికులు చెప్ప‌గా.. ఆడ‌పిల్ల వ‌ద్ద‌నుకున్న ఆ కుటుంబ స‌భ్యులు ఆమెకు అబార్ష‌న్ చేయించారు.

అయితే ఇప్పుడు ఆమె 4వ సారి గ‌ర్భం దాల్చింది. కానీ ఈసారి బిడ్డ‌ను క‌నాల‌ని కుటుంబ స‌భ్యులు చెప్పారు. అయితే ఆ మ‌హిళ ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో గ‌త 3 నెల‌ల నుంచి ఆమెను అత్తింటివారు వేధింపుల‌కు గురి చేయ‌సాగారు.

ఆడ‌పిల్ల‌ను క‌న్నావ‌ని త‌ర‌చూ ఆ మ‌హిళ‌ను నిందిస్తూ వేధించ‌సాగారు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపం చెందిన ఆ మ‌హిళ త‌న బిడ్డ‌ను తానే చంపుకుంది. నీళ్ల ట్యాంకులో ముంచి ప్రాణాల‌ను తీసింది. కానీ అంద‌రికీ త‌న బిడ్డ‌ను ఎవ‌రో కిడ్నాప్ చేశార‌ని చెప్పింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే ఆ మ‌హిళ నేరం తానే చేశాన‌ని అంగీక‌రించింది. దీంతో ఆమెను రిమాండ్‌కు త‌ర‌లించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now