కాశ్మీర్ టు కన్యాకుమారి 4 వేల కి.మీ పరుగు.. గిన్నిస్ బుక్ టార్గెట్..!

April 2, 2021 4:44 PM

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 50 రోజులలో దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పరిగెత్తడానికి భారతీయ ఆర్మీ క్రీడాకారుడు సిద్ధమయ్యారు. భారత సైన్యానికి చెందిన అథ్లెట్ పి.వేలు గురువారం ఈ మిషన్ ప్రారంభించాడు. భారత సైన్యపు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ శ్రీనగర్ నుంచి ఈ పరుగును ప్రారంభించారు. ఈ పరుగును ఢిల్లీ, ఇండోర్, బెంగళూరు మీదగా కన్యాకుమారి చేరుకోవాలని భావించారు. ఫ్లాగ్ అఫ్ వేడుకలో భాగంగా అనేక మంది ఆర్మీ అధికారులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

అథ్లెట్ పి.వేలు తన పాఠశాల రోజుల్లోనే ఎక్కువ దూరం పరుగెత్తడం ప్రారంభించాడు. అదే విధంగా భారత సైన్యంలో చేరడానికి ముందు అనేక మారథాన్‌లలో పాల్గొన్నాడు. ‘గ్రీన్ ఇండియా’, ‘ఒక దేశం వన్ స్పిరిట్’ అనే రెండు నినాదాలతో వేలు.. తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఈ విధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరుగు తీసి గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకోవడమే తన లక్ష్యమని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ పరుగులో తనకు అవసరమైన సహాయ సహకారాలను ఆర్మీ బృందం అందిస్తామని తెలియజేయడంతో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అథ్లెట్ పి.వేలు గత ఏడాది 1600 కిలో మీటర్ల పరుగు లో లిమ్కా రికార్డు సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది నాలుగు వేల కిలోమీటర్లు 50 రోజులలో పూర్తి చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించడమే తన లక్ష్యమని,వాస్తవానికి 50 రోజులు అనుకున్నప్పటికీ కేవలం 47 రోజులలోనే తన టార్గెట్ పూర్తి చేయాలనుకుంటున్నట్లు టి. వేలు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment