Prabhas : పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన బాహుబలి మూవీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పాన్ ఇండియా హీరోగా మారారు. అయితే ప్రభాస్ రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్నారు. గతంలో కోవిడ్ సమయంలో ఈయన ఎంతో మందికి సహాయం చేశారు. కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. ఇక ఇప్పుడు కూడా ఈయన తన దాన గుణాన్ని మరోమారు చాటుకున్నారు.
ఇటీవలే కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడి కొన్ని వందల మంది చనిపోయారు. ఇంకా రోజు రోజుకీ చాలా మృతదేహాలను బురద నుంచి వెలికి తీస్తున్నారు. అయితే వయనాడ్ బాధితులకు సహాయం అందించేందుకు యావత్ దేశం ముందుకు కదిలింది. ఇప్పటికే చాలా మంది విరాళాలను ప్రకటించారు. అలాగే ప్రభాస్ కూడా వయనాడ్ వరద బాధితులకు రూ.2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అక్కడి సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆ మొత్తాన్ని అందజేయనున్నట్లు తెలియజేశారు.
అయితే ఇదే కాదు.. ప్రభాస్ మరో గొప్ప పని కూడా చేస్తున్నారు. ఆయన ఇప్పటికే 100 మంది పేద విద్యార్థులను చదివిస్తున్నారు. వారి చదువులకు అయ్యే ఖర్చులను కూడా ఆయనే భరిస్తున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఓ స్కూల్‌లో 100 మంది విద్యార్థులను ఆయన చదివిస్తున్నారు. వారి ఫీజులు, ఇతర ఖర్చులకు అయ్యే మొత్తాన్ని ఆయనే ఇస్తున్నారు. ఇలా ప్రభాస్ తన దాన గుణాన్ని చాటుకుంటుండడంపై ఆయన ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రభాస్ హీరోగా ఇటీవలే విడుదలైన కల్కి 2898ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. త్వరలోనే ప్రభాస్ రాజాసాబ్‌గా మన ముందుకు రానున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో స్పిరిట్ అనే మూవీలో నటించనున్నారు. దీంతోపాటు సలార్ 2వ పార్ట్, కల్కి 2వ పార్ట్‌లోనూ ఆయన నటిస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…