Coconut In Aeroplan : విమాన ప్రయాణం ద్వారా ఎంతో సమయం ఆదా అవుతుంది. అందుకనే సంపన్న వర్గాలకు చెందిన వారు, అప్పర్ మిడిల్ క్లాస్ వారు విమానాల ద్వారా ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. అయితే విమానాల్లో వెళ్లడం వరకు బాగానే ఉంటుంది. కానీ అందులో ఏ వస్తువును పడితే ఆ వస్తువును తీసుకెళ్తానంటే కుదరదు. విమానాల్లో తీసుకెళ్లేందుకు కేవలం కొన్ని రకాల వస్తువులను మాత్రమే అనుమతిస్తారు. కొన్ని వస్తువులకు అనుమతి ఉండదు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన టాపిక్ తెర మీదకు వచ్చింది. అదేమిటంటే..
విమానాల్లో కొబ్బరికాయలను తీసుకెళ్లవచ్చా.. లేదా.. అని కొందరు అడిగిన ప్రశ్నలకు విమానయాన సంస్థలు సమాధానాలు ఇచ్చాయి. ఎండిన కొబ్బరిని విమానాల్లో అసలు తీసుకెళ్లకూడదని చెప్పారు. ఎందుకంటే ఎండు కొబ్బరిలో నూనె పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఈ కొబ్బరి త్వరగా మండుతుంది. దీంతో విమానంలో మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. కనుక ఎండు కొబ్బరిని విమానాల్లో తీసుకెళ్లకూడదు అని చెప్పారు.
అయితే పచ్చి కొబ్బరిని మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకెళ్లవచ్చని చెప్పారు. అలాగే ప్యాక్ చేయబడిన కొబ్బరి అయితే తీసుకెళ్లవచ్చట. ఎందుకంటే కంపెనీలు అన్నీ సేఫ్టీ ప్రమాణాలను పాటిస్తూ కొబ్బరిని ప్యాక్ చేస్తాయి. కనుక ప్యాక్ చేయబడిన కొబ్బరికి విమానాల్లో అనుమతి ఉంది. ఇక విమానాల్లో తేనెను 100 ఎంఎల్ వరకు తీసుకెళ్లవచ్చు. అదే నీళ్ల బాటిల్ అయితే 100 ఎంఎల్ వరకు అనుమతిస్తారు. శీతల పానీయాలను కూడా 100 ఎంఎల్ వరకు అనుమతిస్తారు.
విమానాల్లో బిర్యానీ, డ్రై కేక్, డ్రై ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు, డ్రై స్వీట్లను తీసుకెళ్లవచ్చు. చేపలు,మాంసాహారాలు, కొబ్బరి, ఊరగాయలు, బియ్యం, పప్పు దినుసులు, అన్ని రకాల మసాలా పొడులు, కారం పొడి వంటి వాటిని విమానాల్లో తీసుకెళ్లేందుకు అనుమతించరు. కనుక ఈ విషయాలను ప్రయాణికులు ముందుగానే తెలుసుకుంటే విమానం ఎక్కే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. లేదంటే మీరు తెచ్చిన ఆ వస్తువులను ఎయిర్‌పోర్టులోనే విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…