Prabhas : ప్ర‌భాస్ గొప్ప‌త‌నం.. ఆయ‌న ఏం చేస్తున్నారో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

January 15, 2026 9:13 PM

Prabhas : పాన్ ఇండియా స్టార్‌, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న త‌న బాహుబ‌లి మూవీ ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పాన్ ఇండియా హీరోగా మారారు. అయితే ప్ర‌భాస్ రీల్ లైఫ్‌లోనే కాదు, రియ‌ల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్నారు. గ‌తంలో కోవిడ్ స‌మ‌యంలో ఈయ‌న ఎంతో మందికి స‌హాయం చేశారు. కోట్ల రూపాయ‌ల‌ను విరాళంగా అందించారు. ఇక ఇప్పుడు కూడా ఈయ‌న త‌న దాన గుణాన్ని మ‌రోమారు చాటుకున్నారు.

ఇటీవ‌లే కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా కొండ చ‌రియ‌లు విరిగిప‌డి కొన్ని వంద‌ల మంది చ‌నిపోయారు. ఇంకా రోజు రోజుకీ చాలా మృత‌దేహాల‌ను బుర‌ద నుంచి వెలికి తీస్తున్నారు. అయితే వ‌య‌నాడ్ బాధితుల‌కు స‌హాయం అందించేందుకు యావ‌త్ దేశం ముందుకు క‌దిలింది. ఇప్ప‌టికే చాలా మంది విరాళాల‌ను ప్ర‌క‌టించారు. అలాగే ప్ర‌భాస్ కూడా వ‌య‌నాడ్ వ‌ర‌ద బాధితుల‌కు రూ.2 కోట్ల భారీ విరాళం ప్ర‌క‌టించారు. అక్క‌డి సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆ మొత్తాన్ని అంద‌జేయ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు.

you will be surprised what Prabhas is doing for poor people
Prabhas

అయితే ఇదే కాదు.. ప్ర‌భాస్ మ‌రో గొప్ప ప‌ని కూడా చేస్తున్నారు. ఆయ‌న ఇప్ప‌టికే 100 మంది పేద విద్యార్థుల‌ను చ‌దివిస్తున్నారు. వారి చ‌దువుల‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను కూడా ఆయ‌నే భ‌రిస్తున్నారు. హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఓ స్కూల్‌లో 100 మంది విద్యార్థుల‌ను ఆయ‌న చ‌దివిస్తున్నారు. వారి ఫీజులు, ఇత‌ర ఖ‌ర్చుల‌కు అయ్యే మొత్తాన్ని ఆయ‌నే ఇస్తున్నారు. ఇలా ప్ర‌భాస్ త‌న దాన గుణాన్ని చాటుకుంటుండ‌డంపై ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక ప్ర‌భాస్ హీరోగా ఇటీవ‌లే విడుద‌లైన క‌ల్కి 2898ఏడీ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసింది. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ రాజాసాబ్‌గా మ‌న ముందుకు రానున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా డైరెక్ష‌న్‌లో స్పిరిట్ అనే మూవీలో న‌టించ‌నున్నారు. దీంతోపాటు స‌లార్ 2వ పార్ట్‌, క‌ల్కి 2వ పార్ట్‌లోనూ ఆయ‌న న‌టిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now