
ఈ ఏడాది వేసవి ప్రారంభంలో రెండు భారీ ప్రాజెక్టు సినిమాలు పోటీ పడబోతున్నాయి. రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2తోపాటు కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన టాక్సిక్ మూవీ కూడా ఒకే రోజున మార్చి 19, 2026న రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే రెండు భారీ సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతున్నది ప్రస్తుతం సినీ వర్గాల్లోనే కాదు, ఫ్యాన్స్, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ధురంధర్ సినిమా మొదటి భాగం ఇచ్చిన సక్సెస్‌తో రణ్‌వీర్ సింగ్ ధురంధర్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుండగా, కేజీఎఫ్ 2 సక్సెస్ అనంతరం యశ్ నటించి సినిమా కావడంతో టాక్సిక్‌పై కూడా భారీగానే అంచనాలు నెలకొన్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండు హెవీ వెయిట్స్ మధ్య ఈసారి స్ట్రాంగ్ పోటీ ఉంటుందని ట్రేడ్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జోరుగా సాగుతోంది.
ధురంధర్ 2, టాక్సిక్.. టఫ్ ఫైట్..?
ఈ రెండు సినిమాల్లోనూ పలు కామన్ పాయింట్లను ఇప్పటికే అభిమానులు నోట్ చేస్తున్నారు. ధురంధర్ మొదటి భాగంలో యాక్షన్, వయొలెన్స్ అధికంగా ఉండగా దానికి ఏమాత్రం తీసిపోని విధంగా ధురంధర్ 2ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అందువల్ల ధురంధర్ 2 కూడా అభిమానులను అలరిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే యశ్ టాక్సిక్ టీజర్ ద్వారా ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలను పెంచేశారు. ఇందులోనూ యాక్షన్, వయొలెన్స్ సీన్లను కొదువ లేదని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. ధురంధర్ 2కు పోటీ తమ సినిమా ఉందని చెప్పేందుకే మేకర్స్ టాక్సిక్ టీజర్‌ను అలా రిలీజ్ చేశారని అంటున్నారు. ఈ క్రమంలో ధురంధర్ 2, టాక్సిక్ మూవీలు బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్‌ను కొనసాగిస్తాయని అంటున్నారు.
ఆ అడ్డంకిని దాటితే..?
అయితే ధురంధర్ 2, టాక్సిక్ సినిమాలకు యాక్షన్, వయొలెన్స్, ఇతర సీన్ల కారణంగా కచ్చితంగా ఎ సర్టిఫికెట్ ఇస్తారు. కనుక ఈ సినిమాలకు ఇదే పెద్ద మైనస్‌గా మారుతుందని అంటున్నారు. ఎందుకంటే సాధారణంగా సినిమాలకు ఎ సర్టిఫికెట్ వస్తే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించడం మేకర్స్‌కు కష్టం అవుతుంది. సినిమా బాగుందని ఎంత టాక్ వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ఇలాంటి సినిమాలను చూసేందుకు వెనుకడుగు వేస్తారు. దీంతో అది కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ ఒక్క అడ్డంకిని ఈ సినిమాలు అధిగమించాల్సి ఉంటుంది. అలా గనక జరిగితే సమ్మర్ బాక్సాఫీస్ ను ఈ సినిమాలు ఘనంగా ప్రారంభించినట్లు అవుతుంది. మరి అన్ని అడ్డంకులను అధిగమించి సమ్మర్ బాక్సాఫీస్ ప్రారంభ బరిలో ధురంధర్ 2, టాక్సిక్ మూవీలలో ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో చూడాలి.












