బుధవారం, జూన్ 24, 2026
వినోదం

Suhas: ఈ హీరో కి ఐదు లక్షలు ఇస్తే గుండు చేయించుకోడానికి కూడా సిద్ధం !

Suhas : సాధారణంగా సినిమాలో పాత్ర నచ్చితే ఆ పాత్ర కోసం హీరో లు హీరోయిన్ లు ఏం చేయటానికైనా సిద్దపడుతూ ఉంటారు. విభిన్నంగా కనిపించటానికి వారు చెయ్యబోయే పాత్రకి న్యాయం చెయ్యడానికి ఎలాంటి కసరత్తులు అయినా చేస్తూ…

Suhas: ఈ హీరో కి ఐదు లక్షలు ఇస్తే గుండు చేయించుకోడానికి కూడా సిద్ధం !

Suhas : సాధారణంగా సినిమాలో పాత్ర నచ్చితే ఆ పాత్ర కోసం హీరో లు హీరోయిన్ లు ఏం చేయటానికైనా సిద్దపడుతూ ఉంటారు. విభిన్నంగా కనిపించటానికి వారు చెయ్యబోయే పాత్రకి న్యాయం చెయ్యడానికి ఎలాంటి కసరత్తులు అయినా చేస్తూ వుంటారు. ఫాన్స్ ని మెప్పిస్తూ, ఆశ్చర్య పరుస్తూ వుంటారు. ఇలా సినిమా కోసం డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించిన వారు అనేకం ఉన్నారు.

Suhas is ready to be appear in movies with bald head

దశావతారం సినిమా కోసం కమల హాసన్ ప్రతి పాత్ర కోసం ఎలా మారారో మనం చూశాం. అలాగే విక్రమ్ అపరిచితుడు, ఐ సినిమాల కోసం చాలా కష్టపడ్డారు. ఈ మధ్య కాలం లో కిక్ ఫేమ్ శ్యాం కూడా ఒక సినిమా కోసం 9 రోజులు నిద్రపోకుండా డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆశ్చర్య పరిచారు. బరువు తగ్గిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు, రాని విద్యలు నేర్చుకున్న వారు అనేకం కనిపిస్తూ ఉంటారు.

ఇప్పుడు సినిమా కోసం గుండు చేయించుకోటానికి సిద్ధపడ్డారు యంగ్ హీరో సుహాస్. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ఛాయ్ బిస్కట్ యూట్యూబ్ ఛానల్ తో మంచి పేరు తెచ్చుకున్న సుహాస్, ఈ మధ్యే వెండి తెర మీద మెప్పిస్తున్నారు. కలర్ ఫోటోతో మంచి పేరు తెచ్చుకున్న సుహాస్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉన్నారు. కలర్ ఫోటో సినిమా OTT లో విడుదలైనప్పటికీ మంచి టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మధ్యే విడుదలైన ఫామిలీ డ్రామా మూవీలో సుహాస్ మంచి పాత్ర పోషించారు. మంచి నటన కనబరుస్తున్న సుహాస్ చేతిలో ఇప్పుడు అరడజన్ వరకు కొత్త ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

ఈ సమయంలో సుహాస్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. త్వరలో రాబోతున్న ఒక కామెడీ ఎంటర్టైనర్ లో సుహాస్ నటిస్తున్నారు. అందులో పాత్ర కోసం సుహాస్ గుండు చేయించుకోబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం అధిక పారితోషికం కూడా డిమాండ్ చేశారంట సుహాస్. ప్రస్తుతం సినిమాకి 40 లక్షలు తీసుకుంటున్న సుహాస్, అదనంగా గుండు చేయించుకుంటున్నందుకు మరో 5 లక్షలు డిమాండ్ చేశారని సమాచారం. అందుకు ఒప్పుకుని ఆ సినిమాని పట్టాలెక్కిస్తున్నారు ప్రొడ్యూసర్లు. మరి సుహాస్ గుండులో ఎలా కనిపిస్తారో చూడాలంటే సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి