Rashmika Mandanna : ర‌ష్మిక అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతుందా.. అయోమ‌యంలో ఫ్యాన్స్..

February 9, 2023 4:42 PM

Rashmika Mandanna : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. తెలుగు, తమిళ్‌లో స్టార్లతో సినిమాలు చేస్తూ ర‌చ్చ చేస్తుంది.. ఇటీవలే దళపతి విజయ్‌తో ‘వారిసు’ చిత్రంలో నటించింది. అలాగే తెలుగులో గతేడాది ‘సీతారామం’ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సక్సెస్‌లో భాగమైంది. ఇక హిందీలో ‘గుడ్ బై, మిషన్ మజ్ను’ చిత్రాల్లో నటించినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రష్మికపై ఇటీవ‌ల నెట్టింట నెగెటివిటీ ఎక్కువైంది. దీనివల్ల పర్సనల్‌గా ఎంత సఫర్ అవుతుందో చెప్పుకొచ్చింది. అయితే త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని ర‌ష్మిక డైరీలో రాసుకుంటుంద‌ట‌.

రష్మిక తన దినచర్య మొత్తం డైరీలో రాసినట్లు రాసి.. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. నిద్రలేచి, వ్యాయామం చేసి, తిన్న తర్వాత వాతావరణం కాలు బయటపెట్టాలంటే భయపడేలా చేసింది. రేపటి ప్రయాణం కోసం బట్టలు సర్దుకున్నాను. మళ్ళీ వర్క్ అవుట్ చేశాను. డిన్నర్ చేశాను. డెర్మట్ ని కలవడం జరిగింది… అని కామెంట్ చేశాసింది.. డెర్మటాలజిస్ట్ ని షార్ట్ గా డెర్మట్ అన్నారని, రష్మిక బహుశా స్కిన్ డిసీజ్ తో బాధపడుతూ ఉండొచ్చని అంద‌రు అంచనా వేస్తున్నారు. ర‌ష్మిక ఏదో చ‌ర్చ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంద‌ని అర్ధ‌మ‌వుతుంది.

Rashmika Mandanna suffering from rare disease
Rashmika Mandanna

ఇటీవ‌ల స‌మంత మ‌యోసైటిస్ బారిన ప‌డి దాదాపు 7 నెల‌ల పాటు వ్యాధితో పోరాడింది. ప్రస్తుతం సమంత కోలుకున్నారన్న సమాచారం అందుతుంది. ఆమె షూటింగ్స్ లో తిరిగి జాయిన్ అయ్యారు. సిటాడెల్ వెబ్ సిరీస్లో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. స‌మంత కోలుకుంటుంది అనే స‌మ‌యంలో ర‌ష్మిక చ‌ర్మ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతుంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు ఆవ‌డంతో ఆమె అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌తో ‘పుష్ప2’ చిత్రంలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇది రష్మిక కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. పుష్ప ఫస్ట్ పార్ట్‌లో తన బ్యూటీనెస్‌తో ఆకట్టుకున్న రష్మిక.. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment