మంగళవారం, జూలై 7, 2026
వార్తలు

Ram Charan Watch Price : రామ్ చ‌ర‌ణ్ పెట్టుకున్న ఈ వాచ్ ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Ram Charan Watch Price : సెల‌బ్రిటీలు అంటే స‌హ‌జంగానే వారు వాడే వ‌స్తువులు ఖ‌రీదు క‌లిగిన‌వి అయ్యే ఉంటాయి. సినీ ప్ర‌ముఖులు వాడే వ‌స్తువుల రేటు అయితే ల‌క్ష‌ల్లో ఉంటుంది. కార్లు అయితే కోట్ల‌లో ఖ‌రీదు ఉంటాయి.…

Ram Charan Watch Price : రామ్ చ‌ర‌ణ్ పెట్టుకున్న ఈ వాచ్ ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Ram Charan Watch Price : సెల‌బ్రిటీలు అంటే స‌హ‌జంగానే వారు వాడే వ‌స్తువులు ఖ‌రీదు క‌లిగిన‌వి అయ్యే ఉంటాయి. సినీ ప్ర‌ముఖులు వాడే వ‌స్తువుల రేటు అయితే ల‌క్ష‌ల్లో ఉంటుంది. కార్లు అయితే కోట్ల‌లో ఖ‌రీదు ఉంటాయి. ఇక వారు వాడే కొన్ని వస్తువుల రేట్లు వింటే వావ్ అంటాం. ఆ వస్తువు వాళ్ళ రేంజ్ ని తెలియజేస్తుంది. అత్తారింటికి దారేది సినిమాలో వాడి వాచ్ ఒకటి చాలు నీ లైఫ్ సెటిల్ అయిపోవడానికి.. అని హీరో ఎంత రిచ్చో చెప్పడం గుర్తుందా. అంటే వాచ్ రేటు ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీలో లక్ష కోట్లకు అధిపతి అయిన పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ ఎంత ఖరీదైనదో చెప్పేందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ డైలాగ్ రాశారు. దాదాపు కోటి రూపాయల విలువైన వాచ్ పెట్టుకోడానికి లక్ష కోట్లే ఉండక్కర్లేదు.. రామ్ చరణ్ చాలు అన్నట్లుగా.. టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

అప్ప‌ట్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త జివికె మనవరాలు శ్రేయ భోపాల్ పెళ్లి జరిగింది కదా. ఆ పెళ్ళికి త‌న భార్య ఉపాసనతో కలిసి రామ్ చరణ్ వచ్చారు. అందరిలానే రెడీ అయివచ్చినా రామ్ మాత్రం అందరి నోట్లో నానారు. దీనికి కారణం ఆయన పెట్టుకొచ్చిన వాచ్ అలాంటిది మరి. ఇండస్ట్రీలో ఖరీదైన వాచ్ లు ధరించేవాళ్ళు చాలామంది వున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి వాచ్ లంటే పిచ్చి. అందుకే మార్కెట్ లోకి వచ్చే లేటెస్ట్ వాచ్ లు కొనేస్తూ తన కలెక్షన్స్ పెంచుకుంటున్నారు. అయితే ఖరీదైన వాచ్ లలో చెర్రీ మిగిలిన హీరోలకు ల్యాండ్ మార్క్ ని సెట్ చేశాడని చెప్పవచ్చు.

Ram Charan Watch Price you will be surprised to know
Ram Charan Watch Price

ఇక జివికె మనవరాలి పెళ్ళికి రామ్ చరణ్ పెట్టుకొచ్చిన వాచ్ ఖరీదు అక్షరాలా రూ.80 లక్షలు ఉం టుందని టాక్ నడుస్తోంది. పాఠక్ పిలిప్పీ బ్రాండ్ అయిన ఈ వాచ్ ఖరీదు అంతలా ఉంటుంది. ఇప్పటిదాకా పది, ఇరవై లక్షలు వెచ్చించి హీరోలు వాచ్ లు కొంటే చెర్రీ ఏకంగా 80 లక్షల విలువైన వాచ్ పెట్టుకోవడం రామ్ చరణ్ కే సాధ్యమైందని చెప్పవచ్చు. ఎంతలేదన్నా మెగాస్టార్ కొడుకు కదా ఆ మాత్రం ఉండాలిలే మరి అంటూ అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే చ‌ర‌ణ్ వాచ్‌కు చెందిన ఈ వార్త ఇప్ప‌టికీ వైర‌ల్ అవుతూనే ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి