వ‌చ్చే వార‌మే ప్ర‌భాస్ నిశ్చితార్థం..? ఎవ‌రితోనో తెలుసా..?

February 6, 2023 8:59 PM

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి వ్య‌వ‌హారానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. అమ్మాయి క‌ల‌ల రాకుమారుడిగా ప్ర‌భాస్‌ని చెప్పుకుంటూ ఉంటారు. ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన త‌ర్వాత ఆయ‌న ఫ్యాన్ ఫాలొయింగ్ మ‌రింత పెరిగింది. ఇంతకు ముందు ప్రభాస్ ప్రేమ పెళ్లి విష‌యంలో వేరే నటీమణులు పేర్లు చాలా వచ్చినా, ఇప్పుడు మాత్రం ప్రభాస్ తో ఆదిపురుష్ లో నటించిన కృతి సనన్ పేరు మాత్రం బాగా వినపడుతోంది. ఆమధ్య ప్రభాస్ ఒక రియాలిటీ షో కి వచ్చినపుడు ప్రభాస్ పెళ్లి టాపిక్ మీదే చాలా నడిచింది.

ఆదిపురుష్ ప్రచారాల్లో భాగంగా ప్రభాస్, కృతి సనన్ చాలా దగ్గరగా వున్నారని, కృతి సనన్ ప్రభాస్ ని చాలా బాగా చూసుకుందని , ప్రభాస్ కాలుకి గాయం అయిన‌ప్పుడు కూడా , కృతి సనన్ సహాయం చాలా తీసుకున్నాడు అని వీరిద్ద‌రి మ‌ధ్య గాఢ‌మైన ప్రేమ న‌డుస్తుంద‌ని ప‌లు ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి.వ‌రుణ్ ధావ‌న్ కూడా ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ న‌డుస్తున్న‌ట్టు ఆ మధ్య ఓ టీవీ షోలో చెప్పుకొచ్చాడు. అయితే ఆ వార్త‌ల‌ని కృతి కొట్టి పారేసింది అనుకోండి. అయితే తాజాగా కృతిస‌న‌న్- ప్ర‌భాస్ పెళ్లి వ్య‌వ‌హారం ఇప్పుడు మ‌రో సారి ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

prabhas engagement reportedly fixed with kriti sanon

నిమా వార్తలు గురించి ఎక్కువ‌గా మాట్లాడుతూ ఉండే ఉమైర్ సంధు ఇప్పుడు ఏకంగా ప్రభాస్ కి కృతి సనన్ కి వచ్చే వారం ఎంగేజ్మెంట్ జరగబోతోంది అని ఒక న్యూస్ పెట్టాడు. అదీ ఇక్కడ ఇండియా లో కాదు, మాల్దీవ్స్ అని పెట్టాడు. త‌న సోష‌ల్ మీడియ‌లో ఇందుకు సంబంధించిన పోస్ట్ చేయ‌గా, అయితే ఈ వార్తకి ప్రభాస్, కృతి సనన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఇటువంటి వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న, సినిమా ముందు ఇలాంటి వార్తలు రావటం సహజమే అని అందరూ కొట్టి పడేసారు. కానీ ఇప్పుడు ప్రభాస్, కృతి సనన్ విషయంలో మరి ఉమైర్ సంధు రాసిన ఈ వార్త ఎంతవరకు నిజం అవుతుందో చూడాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now