“నాగబంధం” టీజర్ అద్భుతం.. మహేష్ బాబు చేతుల మీదుగా మైథలాజికల్ వండర్!

మహా శివరాత్రి శుభసందర్భాన్ని పురస్కరించుకుని నాగబంధం చిత్ర టీజర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ టీజర్‌ను మహేష్ బాబు ఆవిష్కరించడంతో అభిమానుల్లోనే కాకుండా సినీ పరిశ్రమలోనూ ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగింది.

February 15, 2026 8:24 PM
Virat Karna in Lord Shiva avatar from Nagabandham movie teaser.
నాగబంధం టీజర్‌లో విరాట్ కర్ణ అద్భుతమైన మేకోవర్. Photo Credit: Nagabandham Movie Team.

మహా శివరాత్రి శుభసందర్భాన్ని పురస్కరించుకుని నాగబంధం చిత్ర టీజర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ టీజర్‌ను మహేష్ బాబు ఆవిష్కరించడంతో అభిమానుల్లోనే కాకుండా సినీ పరిశ్రమలోనూ ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగింది. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న నాగబంధం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. పురాణ గాథలు, చరిత్ర, ఆధ్యాత్మిక తీవ్రతను మేళవించిన కథనంతో ఈ సినిమా గొప్ప నిర్మాణ విలువలతో ప్రేక్షకుల ముందుకు రానుందని టీజర్ స్పష్టంగా సంకేతాలు ఇస్తోంది.

హిమాల‌యాల నేప‌థ్యం..

హిమాలయాల ఆధ్యాత్మిక నేపథ్యాన్ని వేదికగా చేసుకుని సాగే ఈ కథలో శతాబ్దాలుగా రహస్యంగా కాపాడబడుతున్న ఓ విశ్వశక్తి ప్రధానాంశంగా నిలుస్తుంది. ఆ శక్తిని లోభం వెలికి తీయాలని ప్రయత్నించినప్పుడు, దాన్ని రక్షించేందుకు విధి ఓ యోధుడిని ఎంచుకుంటుందనే భావన టీజర్‌లో ప్రతిబింబించింది. కథలో భాగంగా అబ్దాలీ నేతృత్వంలో జరిగిన చారిత్రక ఆఫ్ఘన్ దండయాత్రకు స్వల్ప ప్రేరణ తీసుకున్నట్లు సమాచారం. సాంస్కృతిక ప్రతిఘటనతోపాటు దైవ రక్షణ భావనను కలిపి కథను నడిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ కథకు కేంద్ర బిందువుగా నిలిచేది పవిత్రమైన నాగబంధం ఆలయం. ఈ ఆలయం ప్రాచీన విశ్వశక్తిని కాపాడుతోందనే నమ్మకమే కథకు ప్రాణం. టీజర్‌లో ఒక్క డైలాగ్ లేకపోయినా, అద్భుతమైన విజువల్స్‌, హైఎండ్ వీఎఫ్‌ఎక్స్‌తో ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపించింది.

ఆక‌ట్టుకుంటున్న శివుడి లుక్‌..

విరాట్ కర్ణ ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన, ఉగ్రరూపంలో కనిపించాడు. ముఖ్యంగా శివుడి అవతారాన్ని తలపించే లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతడి శారీరక మార్పు, తెరపై కనిపించే పవర్ ఈ పాత్ర ఎంత కీలకమైందో చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్, ఇష్వర్య మీనన్, మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బలమైన తారాగణం, ఆధ్యాత్మిక నేపథ్యం, పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న విజన్‌తో నాగబంధం ఇప్పటికే అత్యంత ఆసక్తికరమైన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. భారీ విజువల్స్‌, పురాణ వైభవం, ఆధ్యాత్మిక మర్మాలతో నాగబంధం ప్రేక్షకులకు ఒక విభిన్నమైన సినీ అనుభూతిని అందించబోతుందనే అంచనాలు టీజర్‌తో మరింత బలపడ్డాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment