వినోదం

పూరీ జగన్నాథుని సన్నిధిలో చై-శోభిత.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!

పూరీ జగన్నాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్కినేని నాగచైతన్య, శోభిత దంపతులు. Photo Credit: ANI.

న‌టుడు అక్కినేని నాగ‌చైత‌న్య త‌న భార్య శోభిత ధూళిపాళ‌తో క‌లిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్ర‌సిద్ధ పూరీ జ‌గ‌న్నాథున్ని ద‌ర్శించుకున్నారు. ఆల‌యంలో జ‌గ‌న్నాథుడిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అలాగే మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ఈ జంట‌కు అక్క‌డి ఆల‌య అధికారులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయ‌గా, ద‌ర్శ‌నం అనంత‌రం ఆ దంప‌తుల‌ను అధికారులు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స‌న్మానించారు. కాగా నాగ‌చైత‌న్య‌, శోభిత పూరీ జ‌గ‌న్నాథ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. అయితే వీరు ఏదైనా ప్ర‌త్యేక కార‌ణంతో ఆ ఆల‌యాన్ని ద‌ర్శించారా, లేక సాధార‌ణంగానే ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ద‌ర్శించుకున్నారా.. అన్న విష‌యంపై నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.

ప‌లు సినిమాల‌తో చైత‌న్య బిజీ..

నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఆయ‌న వృష‌క‌ర్మ సినిమాలో యాక్ట్ చేస్తుండ‌గా దీనికి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెరిగింది. తండేల్ సినిమా సూప‌ర్‌హిట్ అయిన అనంత‌రం చైతూ చేస్తున్న సినిమా ఇదే కావ‌డం విశేషం. ఇక ఇందులో ఆయ‌న‌కు జోడీగా మీనాక్షి చౌద‌రి న‌టిస్తోంది. బాలీవుడ్ న‌టుడు స్ప‌ర్శ్ శ్రీ‌వాస్త‌వ విల‌న్ పాత్ర పోషిస్తున్నారు. మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రాం కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. సుకుమార్‌తో క‌లిసి ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా, దీనికి అజ‌నీష్ లోక‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

ఇక అర్జున్ అనే మ‌రో మూవీలోనూ నాగ‌చైత‌న్య న‌టిస్తున్నారు. ఇందులో ఆయన స్టైలిష్‌, ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ గ్లింప్స్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేశారు. అతీంద్రియ శ‌క్తుల‌ను అర్జున్ ఎలా ఎదిరించాడు ? అనే క‌థ‌తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నార‌ని గ్లింప్స్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. భారీ విజువ‌ల్స్‌, గ్రాండ్ బీజీఎం, స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM