క్రికెట్

‘వరుణ్‌కు బదులు కుల్దీప్?’.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు టీమ్ ఇండియాలో బిగ్ డిబేట్!

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ రేసులో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. Photo Credit: ABP Live.

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయాలా అనే అంశంపై క్రికెట్ నిపుణుల మధ్య చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రధానంగా చర్చలో ఉన్న విషయం ఏమిటంటే మిస్టరీ స్పిన్నర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి స్థానంలో లెఫ్ట్-ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాద‌వ్ ను జట్టులోకి తీసుకోవాలా అన్నది వారు చ‌ర్చిస్తున్నారు. అయితే వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ లో విఫ‌లం కావ‌డంతో ఫైన‌ల్‌లో చాన్స్ తీసుకోకూడ‌ద‌ని, అత‌ని క‌న్నా కుల్దీప్‌కు మెరుగైన గ‌ణాంకాలు ఉన్నాయ‌ని, క‌నుక వ‌రుణ్‌కు బ‌దులుగా ఫైన‌ల్‌లో కుల్దీప్‌ను తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఎవ‌రి రికార్డు ఎలా ఉంది..?

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఇప్ప‌టి వ‌ర‌కు 44 టీ20ఐ మ్యాచ్‌లు ఆడ‌గా 42 ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేశాడు. 72 వికెట్లు ప‌డ‌గొట్టాడు. స‌గ‌టు 16.30, ఎకాన‌మీ 7.45గా ఉంది. ఇక కుల్దీప్ యాద‌వ్ 54 మ్యాచ్‌లు ఆడి 52 ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేశాడు. 95 వికెట్లు తీశాడు. స‌గ‌టు 13.74గా ఉంది. ఎకాన‌మీ 6.95గా ఉంది. మొత్తం గణాంకాల ప్రకారం చూస్తే కుల్దీప్ యాదవ్ సగటు, ఎకానమీ పరంగా వరుణ్ కంటే మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు. ఇక వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి న్యూజ‌లాండ్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు 4 మ్యాచ్‌లు ఆడ‌గా 16 ఓవ‌ర్లు బౌలింగ్ వేశాడు. 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. స‌గ‌టు 32.75గా, ఎకాన‌మీ 4.66గా ఉంది. అలాగే కుల్దీప్ యాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కు న్యూజిలాండ్‌ తో 8 మ్యాచ్‌లు ఆడి 25 ఓవ‌ర్లు బౌలింగ్ వేసి 9 వికెట్లు తీశాడు. 21.22 స‌గ‌టు, 7.64 ఎకాన‌మీని న‌మోదు చేశాడు. న్యూజిలాండ్‌పై కుల్దీప్ ఎక్కువ వికెట్లు తీసుకున్నప్పటికీ వరుణ్ ఎకానమీ రేటు మాత్రం మెరుగ్గా ఉంది.

అహ్మ‌దాబాద్ పిచ్‌పై..

ఫైనల్ జరగనున్న న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఇద్దరి ప్రదర్శనలు ఇలా ఉన్నాయి. ఈ మైదానంలో కుల్దీప్ యాద‌వ్ 1 మ్యాచ్ ఆడి 1 ఓవ‌ర్ వేసి 12 ప‌రుగులు ఇచ్చాడు. వికెట్లు తీయ‌లేదు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 3 మ్యాచ్‌లు ఆడి 11 ఓవ‌ర్లు వేసి 8 వికెట్లు తీశాడు. 14.25 స‌గ‌టు, 10.36 ఎకాన‌మీ ఉంది. ఈ మైదానంలో వరుణ్ వికెట్లు ఎక్కువగా తీసుకున్నప్పటికీ ఎకానమీ కొంత ఎక్కువగా ఉంది.

ఎవ‌రు బెట‌ర్‌..?

మొత్తం గణాంకాలను పరిశీలిస్తే కుల్దీప్ యాదవ్ స్థిరమైన ప్రదర్శనతో మెరుగైన టీ20 రికార్డు కలిగి ఉన్నాడు. ఇదే కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు అతన్ని జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయం నిపుణులలో పెరుగుతోంది. ఇక వరుణ్ చక్రవర్తి ఈ టోర్నమెంట్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అతని బౌలింగ్ బాగాలేదు. మరోవైపు కుల్దీప్ యాదవ్ బంతిని రెండు దిశల్లో తిప్పగల సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఎడమచేతి, కుడిచేతి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. అందువల్ల అహ్మదాబాద్ పిచ్‌పై అతను భారత్‌కు అదనపు వికెట్ తీసే అవకాశాన్ని అందించగలడని నిపుణులు భావిస్తున్నారు. మ‌రి టీమిండియా ఎవ‌రిని ఎంపిక చేస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM