వినోదం

ఆ ఇంట్లోనే ఉంటానంటూ విజయ్ భార్య సంగీత పిటిషన్.. కోర్టులో కీలక మలుపు!

విడాకుల కేసు విచారణలో ఉండగానే చెంగల్‌పట్టు కోర్టులో మరో పిటిషన్ వేసిన సంగీత. Photo Credit: The Theorist.

నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ ప‌ట్టు జిల్లా కోర్టులో మ‌రో కొత్త పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కేసు తుది తీర్పు వచ్చే వరకు దాంపత్య గృహంలో నివసించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె ఈ తాజా పిటిషన్‌ను కోర్టులో సమర్పించారు. పిటిషన్‌లో సంగీత పేర్కొన్నదేమిటంటే.. తాను యూకే పౌరురాలిని కావడంతో చెన్నైలో తగిన నివాస సౌకర్యాలు లేవని తెలిపారు. అందువల్ల విడాకుల విచారణ పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న దాంపత్య గృహంలో నివసించేందుకు అనుమతిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. విజయ్ ఇటీవల చెన్నైలో జరిగిన ఓ వివాహ విందులో నటి త్రిషా కృష్ణన్‌తో కలిసి బహిరంగంగా కనిపించిన కొన్ని రోజుల తర్వాత ఈ తాజా పిటిషన్ దాఖలు కావడం గ‌మ‌నార్హం. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. కాగా సంగీత ఇప్పటికే చెంగల్‌ప‌ట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసి వివాహ బంధాన్ని రద్దు చేయాలని కోరారు. విడాకుల పిటిషన్‌తో పాటు దాంపత్య గృహంలో నివసించే హక్కు, శాశ్వత భరణం కూడా ఆమె కోరారు.

విజ‌య్ న్యాయ‌వాది ద్వారా సంకేతాలు..

తాజా పిటిషన్‌లో సంగీత తరఫు న్యాయవాది తెలిపిన ప్రకారం విజయ్ వృత్తి, రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పరస్పర సమ్మతితో గౌరవప్రదంగా విడిపోవడానికి పలుమార్లు ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. ఇంకా పిటిషన్‌లో పేర్కొన్న మరో అంశం ఏమిటంటే, న్యాయపరంగా విడిపోవడానికి కోర్టును ఆశ్రయిస్తే ఆమెకు దాంపత్య గృహంలో నివసించేందుకు అనుమతి ఇవ్వబోమని ప్రత్యర్థి తరఫు న్యాయవాది ద్వారా సంకేతాలు ఇచ్చినట్లు ఆరోపించారు. సంగీత తన పిటిషన్‌లో తాను బ్రిటిష్ పౌరురాలు కావడంతో ప్రస్తుతం కుటుంబ స్థాయికి తగిన ఇతర నివాసం తన వద్ద లేదని పేర్కొన్నారు. అందువల్ల విడాకుల కేసు తుది నిర్ణయం వచ్చే వరకు దాంపత్య గృహంలోనే నివసించేందుకు అనుమతి ఇవ్వాలని లేదా విజయ్ సమాన స్థాయి కలిగిన ప్రత్యామ్నాయ నివాసాన్ని కల్పించాలని కోర్టును కోరారు.

కాగా ఈ పిటిషన్‌పై టీవీకే అధినేత విజయ్ ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు 2026 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించిన పలు హామీలను ప్రకటించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM