వినోదం

మంచు విష్ణు ఫ్యామిలీ కోసం లక్ష్మి ఆందోళన.. దుబాయ్‌లో ఏం జరుగుతోంది?

తన సోదరుడి కుటుంబం సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్. Photo Credit: Manchu Lakshmi/Instagram.

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న తన సోద‌రుడు మంచు విష్ణు, ఆయ‌న‌ కుటుంబ భద్రత కోసం నటి మంచు ల‌క్ష్మి సోషల్ మీడియాలో భావోద్వేగ మెసేజ్‌ను పోస్టు చేశారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆమె వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ క్లిష్ట సమయాల్లో దుబాయ్‌లో ఉన్న విష్ణు, ఆయ‌న‌ అందమైన కుటుంబం సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మనవాళ్ల విషయంలో అయితే మనసుకు మరింత బాధగా అనిపిస్తుంది. మీ అందరినీ నా హృదయంలో దగ్గరగా ఉంచుకున్నాను. దేవుని కృప మీ చుట్టూ ఉండాలి. ప్రేమ మాత్రమే గెలవాలి.. అని మంచు ల‌క్ష్మి పోస్టు పెట్టారు.

మంచు విష్ణు పోస్ట్‌..

ఇటీవల మంచు విష్ణు దుబాయ్ నుంచి ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో రాత్రి ఆకాశంలో క్షిపణులు కనిపించాయి. ఇంటి మీదుగా వినిపించిన భారీ ఇంటర్‌సెప్షన్ శబ్దాలు తన కుమార్తె ఆయ్రాను భయపెట్టాయని తెలిపారు. ఈ రాత్రి దుబాయ్‌లో కుటుంబాన్ని సందర్శిస్తున్నాను. ఆకాశంలో క్షిపణులు కనిపిస్తున్నాయి. పెద్ద శబ్దాలు మా ఇంటిని కంపించాయి, చిన్న ఆయ్రా భయపడింది. శాంతి కోసం ప్రార్థిస్తున్నాను. ఎక్కడా ఏ చిన్నారి యుద్ధ శబ్దాల మధ్య పెరగకూడదు.. అని విష్ణు పోస్టు పెట్టారు. అలాగే యూఏఈ రక్షణ దళాలకు కృతజ్ఞతలు తెలిపారు. పౌరులను సురక్షితంగా ఉంచుతున్న యూఏఈ రక్షణ బలగాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు జీవితం ఎంత సున్నితమో గుర్తుచేస్తాయి. శక్తి, శాంతి కోసం ప్రార్థనలు. హర్ హర్ మహాదేవ్.. అని పేర్కొన్నారు.

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై పలువురు సినీ ప్రముఖులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమిళ స్టార్ అజిత్ కుమార్ కూడా ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉన్నారు. ఆయన చెన్నైకి తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం దుబాయ్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణం సాధ్యపడలేదని ఆయన మేనేజర్ వెల్లడించారు. ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు, ప్రముఖులు తమ భద్రతపై అప్రమత్తంగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM