వామ్మో.. చిరంజీవి వాడే వాచ్ అంత కాస్ట్ లీ నా.. అవాక్క‌వుతున్న నెటిజ‌న్స్..

February 4, 2023 5:42 PM

సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల సెల‌బ్రిటీల‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. వారు ఏ వాచ్ ధ‌రిస్తున్నారు, ఏ బ్రాండ్ వ‌స్తువులు వాడుతున్నారు, ఎలాంటి ల‌గ్జ‌రీ కార్ల‌లో ప్ర‌యాణిస్తున్నారు వంటి అంశాల‌పై తెగ ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు రామ్ చరణ్ లగ్జరీ లైఫ్ స్టైల్, గాడ్జెట్స్, స్టైలింగ్ గురించి వాటికి సంబంధించిన కాస్ట్ గురించి వరుసగా వార్తలు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు చిరంజీవికి సంబంధించి వార్త‌లు వ‌స్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా థియేటర్లలోకి వచ్చి తెగ సంద‌డి చేశాడు.

తన వింటేజ్ లుక్ గుర్తుచేసేలా ఉన్న వాల్తేరు వీర్య‌ సినిమా ప్రేక్షకుల్ని, మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించింది. డ్యాన్సులు, ఫైట్స్ తో దుమ్మురేపారు. ఈ ఊపులో ‘భోళా శంకర్’ షూటింగ్ లో బిజీగా మారిపోయారు. ఈ క్ర‌మంలో మెగాస్టార్ వాచీల కాస్ట్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ స్టార్ట్ అయింది. సినిమాల ఈవెంట్స్ లో పాల్గొనే టైంలో చిరు డిఫరెంట్ డిఫరెంట్ వాచీలతో కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ దృష్టి వాటిపై పడింది. చిరు ధరించిన వాటిలో రోలెక్స్ వాచ్ అత్యంత ఖరీదైనదని తెలుస్తోంది.

do you know about chiranjeevi watch price

రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ కాస్ట్ రూ. కోటి 86 లక్షల 91 వేల రూపాయలకు పైనే అని తెలుస్తోంది. చిరు దగ్గర మరో వాచ్ కూడా ఉండ‌గా, అది ఎ లాంగే అండ్ సోహ్నే వాచ్ అది. దీని ఖరీదు రూ.33 లక్షలకు పైనే అని తెలుస్తోంది. ఇలా సినిమాలతో మాత్రమే కాకుండా వాచీల కాస్ట్ తోనూ చిరు వార్తల్లో ఉంటున్నారు. స్వ‌యంకృషితో ఎదిగిన చిరంజీవి ఇప్పుడు ఉన్న‌త స్థానంలో ఉన్నారు. ఆయ‌న ఎంత సంపాదించిన కూడా కొంత ప్ర‌జా సేవ‌కి ఉప‌యోగిస్తున్న విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment