Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న జంట సిరి-షణ్ముఖ్. వీరిద్దరూ ఫ్రెండ్స్ అంటూ ఎంత రచ్చ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గేమ్ చివరి దశకు చేరుకున్నా కూడా వీరి రచ్చ ఆగడం లేదు. షణ్ముఖ్.. సిరి ఎవరితో అయినా చనువుగా ఉంది అంటే అలిగి మూలన కూర్చుంటున్నాడు. తాజా ఎపిసోడ్‌లో అదే చూశాం. అయితే తాజాగా బిగ్ బాస్ ‘రోల్‌ప్లే’ అంటూ సీజన్-5లో ఉన్న హౌస్‌మేట్స్ ఎవరెలా ప్రవర్తించారో చేసి చూపించాలనే గేమ్ ఇచ్చాడు.
ఈ టాస్క్‌లో గెలిచిన వారికి ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందట. గెలిచిన కంటెస్టెంట్‌కు ఓట్లు వేయమని ఆడియెన్స్‌ను రిక్వెస్ట్ చేసుకునే చాన్స్ ఇస్తాడట బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా మానస్ ప్రియాంకలా, సన్నీ మానస్‌లా మారిపోయి తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. ముఖ్యంగా మానస్ అయితే.. అచ్చం ప్రియాంకలా ప్రవర్తిస్తూ ఆమెపై తనకు ఉన్న ప్రేమనంతా తీర్చుకున్నాడు. మానస్ పాత్రలో ఉన్న సన్నీతో మసాజ్ కూడా చేయించుకున్నాడు.
షణ్ముఖ్ జెస్సీలా మారి సిరిని ఆటపట్టించాడు. జెస్సీలా మాట్లాడుతూ.. సిరి ముద్దు ఇవ్వవే అని అడిగేశాడు. దీంతో సిరిగా మారిన శ్రీరామ్ చేతులు అడ్డుపెట్టి షన్నూకు లిప్‌లాక్ ఇచ్చాడు. ఇక కాజల్ సన్నీలా మారి అతన్ని బాగానే ఇమిటేట్ చేసింది. మొత్తానికి నేటి ఎపిసోడ్ మాత్రం మంచి ఊపు మీదుండేట్టు కనిపిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…