Bigg Boss 5 : పిచ్చి పీక్స్‌కు.. మ‌గాళ్లు, మ‌గాళ్లు లిప్‌లాక్‌లు పెట్టేసుకుంటున్నారు..!

December 7, 2021 7:20 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 లో అంద‌రి దృష్టినీ ఆకర్షిస్తున్న జంట సిరి-ష‌ణ్ముఖ్‌. వీరిద్ద‌రూ ఫ్రెండ్స్ అంటూ ఎంత ర‌చ్చ చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే గేమ్ చివరి ద‌శ‌కు చేరుకున్నా కూడా వీరి ర‌చ్చ ఆగ‌డం లేదు. ష‌ణ్ముఖ్‌.. సిరి ఎవ‌రితో అయినా చ‌నువుగా ఉంది అంటే అలిగి మూల‌న కూర్చుంటున్నాడు. తాజా ఎపిసోడ్‌లో అదే చూశాం. అయితే తాజాగా బిగ్ బాస్ ‘రోల్‌ప్లే’ అంటూ సీజన్‌-5లో ఉన్న హౌస్‌మేట్స్‌ ఎవరెలా ప్రవర్తించారో చేసి చూపించాలనే గేమ్‌ ఇచ్చాడు.

Bigg Boss 5 gents are kissing each other in the show

ఈ టాస్క్‌లో గెలిచిన వారికి ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందట. గెలిచిన కంటెస్టెంట్‌కు ఓట్లు వేయమని ఆడియెన్స్‌ను రిక్వెస్ట్ చేసుకునే చాన్స్ ఇస్తాడట బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా మానస్‌ ప్రియాంకలా, సన్నీ మానస్‌లా మారిపోయి తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. ముఖ్యంగా మానస్‌ అయితే.. అచ్చం ప్రియాంకలా ప్రవర్తిస్తూ ఆమెపై తనకు ఉన్న ప్రేమనంతా తీర్చుకున్నాడు. మానస్‌ పాత్రలో ఉన్న సన్నీతో మసాజ్‌ కూడా చేయించుకున్నాడు.

ష‌ణ్ముఖ్ జెస్సీలా మారి సిరిని ఆట‌ప‌ట్టించాడు. జెస్సీలా మాట్లాడుతూ.. సిరి ముద్దు ఇవ్వవే అని అడిగేశాడు. దీంతో సిరిగా మారిన శ్రీరామ్‌ చేతులు అడ్డుపెట్టి షన్నూకు లిప్‌లాక్‌ ఇచ్చాడు. ఇక కాజల్‌ సన్నీలా మారి అతన్ని బాగానే ఇమిటేట్ చేసింది. మొత్తానికి నేటి ఎపిసోడ్ మాత్రం మంచి ఊపు మీదుండేట్టు కనిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now