అమ్మాయిల‌ని ట్రాప్ చేయ‌డానికే కొంత‌మంది హీరోలున్నారు.. అర్చ‌న సంచ‌ల‌న కామెంట్స్..

February 5, 2023 12:09 PM

తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు ఈ.సత్తి బాబు దర్శకత్వం వహించిన “నేను” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్‌ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి “అర్చన వేద‌ శాస్త్రి” . శ్రీరామదాసు, పౌర్ణమి, సామాన్యుడు, యమదొంగ, ఖలేజా వంటి సినిమాల‌తో పాటు బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది. ఈమె అప్పుడ‌ప్పుడు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తుంది. తాజాగా అర్చ‌న మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అమ్మాయిలని ట్రాప్ చేయాలని కొంతమంది హీరోలు ఉంటారని. మైండ్ ని క్యాప్చర్ చేయడానికి చూస్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు.

ఎవ‌రైన అమ్మాయి కాస్త వీక్ గా ఉంటే.. ఆ అమ్మాయి మైండ్ ని క్యాప్చర్ చేయడానికి కొంతమంది జనాలు ఉంటారని ఆమె అన్నారు. అందుకే అమ్మాయిలు వీక్ కాకూడ‌దు. ఏడిస్తే వీక్ అన‌డం క‌రెక్ట్ కాదు. ఏడుపుకి, వీక్ కి సంబంధం లేదని అన్నారు. తనను కూడా వీక్ అనుకుని ఒక హీరో ట్రాప్ చేయాలని చూశాడని అత‌ను మ‌న‌కి బాగా తెలిసిన వ్యక్తే. మరీ ఎక్కువ సక్సెస్ కలిగిన హీరో కాదు. ఆయన నాకు తెలియకుండా నా వెనకాల నీచమైన మాటలు కూడా మాట్లాడాడట.అత‌ని మాట‌ల‌కు వేరే వాళ్లు అయితే చాలా బాధ‌ప‌డేవారు. అయితే అందంగా ఉండి బ్యాక్ గ్రౌండ్ పెద్దగా లేని అమ్మాయిల‌ని వారి మైండ్ ని క్యాప్చర్ చేయడానికి ఇలాంటి వ్యక్తులు ఉన్నారని కామెంట్స్ చేశారు.

archana sensational comments on tollywood heroes

మ‌న‌కు మంచిది అనేది ముందే తెలుస్తుంది. మనకి సెట్ కాని పరిస్థితుల్లో కొందరు వీక్ అవుతారు. అలాంటి వారికి చేదు అనుభవాలు ఎదురవుతాయని..అలాంటివి ఏ అమ్మాయికైనా, అబ్బాయికైనా జరగకూడదని అర్చ‌న అన్నారు. త‌న‌కి ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని.. అతని ఉద్దేశం ఏంటో తెలుసుకోగలిగానని ఆమె అన్నారు. రాధాగోపాలం సినిమాలో అవకాశాన్ని మిస్ చేసుకున్నానని చెప్పుకొచ్చిన ఈ భామ అందులో న‌టించి ఉంటే కెరీర్ మ‌రోలా ఉండేదని చెప్పుకొచ్చింది. రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర తనను ఎంతగానో మెస్మరైజ్ చేసినట్టు చెప్పుకొచ్చింది అర్చ‌న‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now