అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు AA22xA6 అని వ్య‌వ‌హ‌రించారు. కానీ ఈ మూవీకి టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రానికి రాకా అనే పేరు పెట్టారు.

April 8, 2026 6:19 PM
Allu Arjun in a fierce beast look from the movie Raka directed by Atlee.
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘రాకా’ చిత్రంలోని బీస్ట్ అవతార్. Photo Credit: Sun Pictures/Instagram.

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు AA22xA6 అని వ్య‌వ‌హ‌రించారు. కానీ ఈ మూవీకి టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రానికి రాకా అనే పేరు పెట్టారు. ఈ సంద‌ర్భంగా రాకా చిత్రంలో అల్లు అర్జున్ లుక్‌కు సంబంధించిన ఫ‌స్ట్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. అందులో ఆయ‌న భ‌యంక‌ర‌మైన బీస్ట్ రూపంలో క‌నిపించారు. పొడ‌వైన గోర్ల‌తో, క్రూర‌మైన లుక్‌తో ఉన్న ఆయ‌న పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. బ‌న్నీ ఫ్యాన్స్ ఈ పోస్ట‌ర్ చూసి ఫిదా అవుతున్నారు. మ‌రో హిట్ లోడింగ్ అంటూ సోష‌ల్ మీడియాలో ఈ పోస్ట‌ర్‌ను వైర‌ల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

అదిరిపోయిన లుక్‌..

రాకా చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతుండ‌గా మొత్తం 9 భార‌తీయ భాష‌ల్లో రిలీజ్ కానుంది. అయితే తెలుగుతోపాటు ఈ చిత్ర టైటిల్ పోస్ట‌ర్‌ను హిందీ, ఇంగ్లిష్ త‌దిత‌ర మొత్తం 9 భాష‌ల్లో రిలీజ్ చేశారు. అయితే ఇంగ్లిష్‌లోనూ రిలీజ్ చేయ‌డంతో సినిమా పాన్ వ‌రల్డ్‌గా రిలీజ్ కానుందా.. అని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక రాకా సినిమా పోస్ట‌ర్‌లో అల్లు అర్జున్ ప్రోస్థెటిక్ మేక‌ప్‌తో క‌నిపించారు. వ‌య‌స్సు ఎక్కువ‌గా క‌నిపించేలా మేకోవ‌ర్ అయ్యారు. ఆయ‌న క‌ళ్ల కింద కాటుక రేఖ‌లు, ఆయ‌న ధ‌రించిన ఉన్ని దుస్తులు, బ‌య‌ట‌కు క‌నిపిస్తున్న పొడ‌వైన గోర్లు, చేతుల‌పై భ‌ల్లూకానికి ఉన్న‌ట్లు వెంట్రుక‌లు ఉండ‌డంతో ఫ్యాన్స్ షాక‌య్యారు. మ‌రో భారీ హిట్ ఖాయం అని అంటున్నారు. ఇక ఈ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన సంద‌ర్బంగా చిత్ర యూనిట్ ఆ ఫొటోకు ప్రిపేర్ యువ‌ర్‌సెల్ఫ్ ఫ‌ర్ ఎ విజన్ బియాండ్ లిమిట్స్ అనే క్యాప్ష‌న్ ను పెట్టారు.

4 భిన్న‌మైన పాత్ర‌ల్లో..

రాకా సినిమా సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోంది. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను అల్లు అర్జున్ 43వ పుట్టిన రోజు సంద‌ర్బంగా గ‌తేడాది ఇదే రోజున అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఈ మూవీలో ఆయ‌న లుక్ కు చెందిన ఫ‌స్ట్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ తొలిసారిగా త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీతో క‌లిసి ఈ సినిమా చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ 4 భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. అందులో తాత‌, తండ్రి, ఇద్ద‌రు కుమారుల పాత్ర‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. క‌థ రెండు స‌మాంత‌ర ప్ర‌పంచాల కాన్సెప్ట్‌పై ఆధార ప‌డి ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ విష‌యాల‌పై చిత్ర బృందం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

రూ.800 కోట్ల బ‌డ్జెట్‌..

ఈ సినిమాలో బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి దీపికా ప‌దుకొనే కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి అల్లు అర్జున్ ఏకంగా రూ.175 కోట్ల పారితోషికం తీసుకుంటుండ‌డంతోపాటు లాభాల్లో 15 శాతం వాటా పొంద‌నున్నార‌ని తెలిసింది. ద‌ర్శ‌కుడు అట్లీ రూ.100 కోట్లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇక సినిమా బ‌డ్జెట్ రూ.800 కోట్లు ఉండ‌గా, అందులో రూ.200 కోట్లు నిర్మాణానికి, రూ.250 కోట్లు విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు కేటాయించిన‌ట్లు స‌మాచారం. ఇక ఈ మూవీని 2027లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కానీ విడుద‌ల తేదీని ఇప్ప‌టి వ‌ర‌కు మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment