విజయ్‌కు భార్య సంగీత విడాకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు!

త‌మిళ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్‌తో విడాకులు కావాల‌ని కోరుతూ ఆయ‌న భార్య సంగీత కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. చెంగ‌ల్‌ప‌ట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిష‌న్ వేశారు. దేశ‌మంత‌టా ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా అంద‌రూ ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు.

February 27, 2026 9:23 PM
Actor Vijay and his wife Sangeetha together at an event.
27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు కోరిన సంగీత. Photo Credit: Social Media.

త‌మిళ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్‌తో విడాకులు కావాల‌ని కోరుతూ ఆయ‌న భార్య సంగీత కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. చెంగ‌ల్‌ప‌ట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిష‌న్ వేశారు. దేశ‌మంత‌టా ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా అంద‌రూ ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. విజ‌య్ ఫ్యాన్స్‌ను సైతం ఈ విష‌యం షాక్‌కు గురి చేసింది. ప్ర‌స్తుతం సంగీత పిటిష‌న్‌కు చెందిన వార్త సామాజిక మాధ్య‌మాల్లోనూ వైర‌ల్‌గా మారింది. విజ‌య్‌తో విడాకులు కావాల‌ని కోరుతూ ఆయ‌న భార్య సంగీత అలా పిటిష‌న్ వేయ‌డం త‌మిళ‌నాడులో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఆమె విడాకులు కోరేందుకు ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అధికారికంగా రాని ప్ర‌క‌ట‌న‌..

నటుడు విజ‌య్‌కు ఓ న‌టితో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని, అలాగే ఆయ‌న త‌న‌ను హింస‌కు గురి చేశార‌ని ఆరోపిస్తూ సంగీత పిటిష‌న్‌లో పేర్కొన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీనిపై విజ‌య్‌, సంగీత లేదా వారి త‌ర‌ఫు ప్ర‌తినిధుల నుంచి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కనుక ఈ వార్త‌లు నిజ‌మా, కాదా అని విజ‌య్ ఫ్యాన్స్ కూడా సందిగ్ధంలో ఉన్నారు. అయితే సాధార‌ణంగా సెల‌బ్రిటీలు ఇలా విడాకుల విష‌యంలో చేసే చ‌ర్య‌లు ప‌బ్లిక్‌కు తెలిసినా అధికారికంగా మాత్రం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌రు. కానీ విజ‌య్ రాజ‌కీయ పార్టీ పెట్టి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్నారు క‌నుక ఈ విష‌యంపై ఆయ‌న క్లారిటీ ఇస్తార‌ని తెలుస్తోంది.

ఆ వ్యాఖ్య‌ల అనంత‌ర‌మే..

కాగా ఇటీవ‌లే న‌టుడు విజ‌య్‌పై త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడు నైనార్ నాగేంద్ర‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య్‌కి, త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఓ న‌టితో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని అన్నారు. కానీ ఆ విష‌యాన్ని టీవీకే పార్టీ నేత‌లు ఖండించారు. అయితే ఆ సంఘ‌ట‌న జ‌రిగి కొద్ది రోజులు కూడా గ‌డ‌వ‌క ముందే విజ‌య్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిష‌న్ వేయ‌డం సంచ‌లనంగా మారింది. దీనిపై విజ‌య్ లేదా ఆయన పార్టీ నుంచి ఏదైనా ప్ర‌క‌ట‌న వస్తుందేమోన‌ని అంద‌రూ వేచి చూస్తున్నారు. ఇక విజ‌య్‌, సంగీత‌లు 1999లో వివాహం చేసుకోగా వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment