ఆధ్యాత్మికం

ఉగాది విశిష్ట‌త ఏమిటో, ఎవ‌రెవ‌రు ఈ పండుగ‌ను జ‌రుపుకుంటారో తెలుసా..?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆంగ్ల నూత‌న సంవ‌త్స‌రాన్ని ప్ర‌జ‌లు జ‌రుపుకుంటారు. కానీ తెలుగు సంవ‌త్స‌రం ప్రారంభాన్ని తెలుగు ప్ర‌జ‌లు మాత్ర‌మే జ‌రుపుకుంటారు. అది తెలుగు వారికి మాత్ర‌మే ప్ర‌త్యేకం. నూత‌న తెలుగు సంవ‌త్స‌రం ప్రారంభం రోజునే ఉగాది అని కూడా పిలుస్తారు. అంటే.. ఉగ అనే ప‌దానికి యుగం అనే అర్థం వ‌స్తుంది. ఆది అంటే ఆరంభం అన్న‌మాట‌. అంటే కొత్త సంవ‌త్స‌రం ప్రారంభం అవుతుంద‌ని అర్థం.

భార‌తీయ సంప్ర‌దాయం ప్ర‌కారం చైత్ర శుక్ల పాడ్య‌మి నాడు ఉగాది వ‌స్తుంది. సృష్టి ఆ రోజే జ‌రిగింద‌ని కూడా పురాణాల్లో చెప్పారు. అలాగే వేదాల‌ను హ‌రించిన సోమ‌కున్ని మ‌త్స్యావ‌తారంలో ఉండే విష్ణువు వ‌ధిస్తాడు. దీంతో వేదాల‌ను తిరిగి బ్ర‌హ్మ‌కు అప్ప‌గిస్తారు. ఈ క్ర‌మంలో విష్ణువు ప్రీత్య‌ర్థం ఉగాది ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చింద‌ని పురాణాలు చెబుతున్నాయి. ఇక శాలివాహ‌న చ‌క్ర‌వ‌ర్తి ఈ రోజునే శాలివాహ‌న యుగ‌క‌ర్త‌గా పేరుగాంచాడు. అందువ‌ల్లే ఈ రోజును ఉగాదిగా జ‌రుపుకుంటున్నార‌ని కూడా చెబుతారు.

ఉగాది రోజునే నూత‌న తెలుగు సంవ‌త్స‌రం ప్రారంభం అవుతుంది. క‌నుక ఇది తెలుగు వారి పండుగ‌. ఉగాది రోజున ఉగాది ప‌చ్చ‌డిని సేవించ‌డం, పంచాంగం విన‌డం ఆన‌వాయితీ. ఇక మ‌రాఠీ వారు ఈ పండుగ‌ను గుడిప‌డ్వాగా జ‌రుపుకుంటారు. త‌మిళులు పుత్తాండు పేరిట‌, మ‌ళ‌యాళీలు విషుగా, సిక్కులు వైశాఖీగా, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్‌గా జ‌రుపుకుంటారు. పేరేదైన‌ప్ప‌టికీ పండుగ‌లోని భావం ఒక్క‌టే. నూత‌న సంవ‌త్స‌రానికి ఆరంభం ఉగాది. ఆ రోజున అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటారు. కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. ఇలా ఉగాది పండుగ‌ను జ‌రుపుకుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM