ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన మూడు సిరీస్‌లను భారత్ కైవసం చేసుకున్న విషయం విదితమే. తొలుత టెస్టు సిరీస్‌ను 3-1తో తరువాత టీ20 సిరీస్ ను 3-2తో భారత్ స్వాధీనం చేసుకుంది. తాజాగా వన్డే సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. చివరి వన్డేలో ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది.
అయితే వన్డే సిరీస్‌ను దక్కించుకోవడంతో భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ 121 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, భారత్ 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 118 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో దక్కించుకున్నప్పటికీ న్యూజిలాండ్ అదే స్థానంలో స్థిరపడింది. అయితే వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన భారత్ 119 పాయింట్లను పొందింది. దీంతో వన్డే ర్యాంకింగ్‌లలో 2వ స్థానానికి చేరుకుంది.
ఇక టెస్టులలో భారత్ మొదటి స్థానంలో ఉండగా, టీ20లలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి 14వ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదలు కానుండడంతో ఇప్పటికే భారత ఆటగాళ్లందరూ తమ తమ టీమ్‌ల వద్దకు చేరుకున్నారు. దీంతో ఫ్యాన్స్ మళ్లీ క్రికెట్ సమరం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…