Coins In River : ఎప్పుడైనా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేదంటే ప్రత్యేకించి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు, అందులో డబ్బులు వేస్తూ ఉంటాము. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు గోదావరి, కృష్ణ నదులు కానీ లేదంటే ఇంకేమైనా నదులు కనపడితే, ట్రైన్లో నుంచే నాణేలు వేస్తూ ఉంటాము. అయితే, ఎందుకు అలా వేస్తారు..?, దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం నుండి కూడా పూర్వీకులు, నది స్నానాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు.
నదీ స్నానం చేస్తే, ఎంతో పుణ్యం కలుగుతుందని భావిస్తారు. నది దగ్గర పూజలు కూడా చేస్తూ ఉంటారు. దీపాన్ని పెట్టి, నదిలో నాణేలు కూడా వేస్తూ వుంటారు. అయితే, పూర్వీకులు పాటించినట్లే మనం కూడా పాటిస్తూ వచ్చాము. అయితే, అసలు ఎందుకు నాణేలు వేసేవారు.. అనే విషయానికి వచ్చేస్తే.. ఇప్పుడైతే నాణేలు ఇనుప ముక్కలే. ఇది వరకు నాణేలు రాగివి ఉండేవి. రాగి వాటినే ఇది వరకు ఎక్కువగా వాడేవారు.
రాగి పాత్రలు, రాగి నాణేలు వాళ్ళు వాడేవాళ్లు, కానీ ఇప్పుడు అలా కాదు. అయితే, ఇది వరకు ఉండే రాగి కాయిన్స్ ని నీళ్లలో వేయడం వలన నీళ్లు శుభ్రంగా మారేవి. నీటిని శుభ్రం చేసే గుణం రాగి కి ఉంది. అందుకని, రాగి వాటిని అందులో వేసేవారు. రాగి కాయిన్స్ అందులో వేయడం వలన, నీళ్లు బాగా స్వచ్ఛంగా మారేవి. నదిలోని నీళ్లు శుభ్రం అవుతాయి. అటువంటి నీళ్లు తాగడానికి పనికొస్తాయని, రాగి కాయిన్స్ ని నదిలో వేసేవారు.
కానీ, ఇప్పుడు రాగి నాణేలు లేవు. మనం వాడుతున్న నాణేలని నదిలో వేయడం వలన ఉపయోగం అయితే ఏమీ లేదు. నీరు శుభ్రం అవ్వవు. ఇక ఇప్పుడు ఈ నాణాలని వేయడం వలన అవి తుప్పుపట్టేస్తాయి. నీళ్లు కూడా పాడైపోతాయి. కాబట్టి, ఇలా వేయడం వలన ఉపయోగం లేదని తెలుసుకోండి. కొంతమంది కొబ్బరికాయలు కొట్టి నదిలోకి విసురేస్తూ ఉంటారు. అలా చేయడం వలన కూడా నీళ్లు పాడైపోతాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…