Coins In River : న‌దుల్లో అస‌లు నాణాల‌ను ఎందుకు వేస్తారు.. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి..?

September 1, 2023 11:39 AM

Coins In River : ఎప్పుడైనా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేదంటే ప్రత్యేకించి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు, అందులో డబ్బులు వేస్తూ ఉంటాము. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు గోదావరి, కృష్ణ నదులు కానీ లేదంటే ఇంకేమైనా నదులు కనపడితే, ట్రైన్లో నుంచే నాణేలు వేస్తూ ఉంటాము. అయితే, ఎందుకు అలా వేస్తారు..?, దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం నుండి కూడా పూర్వీకులు, నది స్నానాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు.

నదీ స్నానం చేస్తే, ఎంతో పుణ్యం కలుగుతుందని భావిస్తారు. నది దగ్గర పూజలు కూడా చేస్తూ ఉంటారు. దీపాన్ని పెట్టి, నదిలో నాణేలు కూడా వేస్తూ వుంటారు. అయితే, పూర్వీకులు పాటించినట్లే మనం కూడా పాటిస్తూ వచ్చాము. అయితే, అసలు ఎందుకు నాణేలు వేసేవారు.. అనే విషయానికి వచ్చేస్తే.. ఇప్పుడైతే నాణేలు ఇనుప ముక్కలే. ఇది వరకు నాణేలు రాగివి ఉండేవి. రాగి వాటినే ఇది వరకు ఎక్కువగా వాడేవారు.

Coins In River why throw them
Coins In River

రాగి పాత్రలు, రాగి నాణేలు వాళ్ళు వాడేవాళ్లు, కానీ ఇప్పుడు అలా కాదు. అయితే, ఇది వరకు ఉండే రాగి కాయిన్స్ ని నీళ్లలో వేయడం వలన నీళ్లు శుభ్రంగా మారేవి. నీటిని శుభ్రం చేసే గుణం రాగి కి ఉంది. అందుకని, రాగి వాటిని అందులో వేసేవారు. రాగి కాయిన్స్ అందులో వేయడం వలన, నీళ్లు బాగా స్వచ్ఛంగా మారేవి. నదిలోని నీళ్లు శుభ్రం అవుతాయి. అటువంటి నీళ్లు తాగడానికి పనికొస్తాయని, రాగి కాయిన్స్ ని నదిలో వేసేవారు.

కానీ, ఇప్పుడు రాగి నాణేలు లేవు. మనం వాడుతున్న నాణేలని నదిలో వేయడం వలన ఉపయోగం అయితే ఏమీ లేదు. నీరు శుభ్రం అవ్వవు. ఇక‌ ఇప్పుడు ఈ నాణాలని వేయడం వలన అవి తుప్పుపట్టేస్తాయి. నీళ్లు కూడా పాడైపోతాయి. కాబట్టి, ఇలా వేయడం వలన ఉపయోగం లేదని తెలుసుకోండి. కొంతమంది కొబ్బరికాయలు కొట్టి నదిలోకి విసురేస్తూ ఉంటారు. అలా చేయడం వలన కూడా నీళ్లు పాడైపోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now