సాధారణంగా చిన్న పిల్లలకి ఏవి ప్రమాదకరమైనవి, ఏవి ప్రమాదకరమైనవి కావో వారికి తెలియదు.. కనుక నిత్యం తల్లిదండ్రులు వారిని గమనిస్తూనే ఉండాలి. లేదంటే ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం మొదలవడంతో పిల్లలు ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ఎలాంటి పరిస్థితులలో కూడా కరెంట్ స్తంభాలను తాకకూడదని వారికి అర్థమయ్యే విధంగా హెచ్చరించాలి. లేదంటే ఈ బాలుడికి జరిగిన విధంగా జరుగుతుంది. రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న సదుల్‌పూర్ తాలూకా నుహంద్ అనే గ్రామంలో ఒక బాలుడు సరదాగా ఆడుకుంటూ కరెంటు స్తంభాన్ని తాకాడు. ఇలా తాకగానే కరెంట్ షాక్ కొడుతూ ఆ బాలుడు స్తంభానికి అతుక్కుపోయాడు.
ఆ గ్రామానికి చెందిన ఆదిల్ అనే బాలుడు మరొక బాలుడితో కలిసి సరదాగా ఆడుకుంటూ రోడ్డుపై వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిల్ రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని తాకాడు. అప్పటికే ఆ స్తంభం వెంట విద్యుత్ ప్రవాహం వస్తుండడంతో ఒక్కసారిగా ఆ బాలుడు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దీంతో అతని శరీరం నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఈ విధంగా ఆ బాలుడు విద్యుత్ ఘాతానికి గురై కొట్టుమిట్టాడుతుంటే ఈ విషయాన్ని గమనించిన ఓ స్థానికుడు ఎంతో ధైర్యం చేశాడు.
ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి ఆ బాలుడిని కాపాడాలనే ఉద్దేశంతో అక్కడే ఉన్న ఒక చెక్కతో ఆ బాలుడి చేతిని కొట్టి పక్కకు లాగాడు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున స్థానికులు చేరుకుని ఆ బాలుడిని రక్షించే పనిలో పడ్డారు. అయితే వారు అతన్ని బయటకు తీసి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆ బాలుడి శరీరం బాగా కాలిపోయింది. దీంతో అతను విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇలా ఎవరి పిల్లలకూ జరగకూడదు. కనుక చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…