పాపం.. అభం శుభం తెలియని బాలుడు.. కరెంటు స్తంభాన్ని ముట్టుకున్నాడు..

September 17, 2021 10:48 PM

సాధారణంగా చిన్న పిల్లలకి ఏవి ప్రమాదకరమైనవి, ఏవి ప్రమాదకరమైనవి కావో వారికి తెలియదు.. కనుక నిత్యం తల్లిదండ్రులు వారిని గమనిస్తూనే ఉండాలి. లేదంటే ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం మొదలవడంతో పిల్లలు ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ఎలాంటి పరిస్థితులలో కూడా కరెంట్ స్తంభాలను తాకకూడదని వారికి అర్థమయ్యే విధంగా హెచ్చరించాలి. లేదంటే ఈ బాలుడికి జరిగిన విధంగా జరుగుతుంది. రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న సదుల్‌పూర్ తాలూకా నుహంద్ అనే గ్రామంలో ఒక బాలుడు సరదాగా ఆడుకుంటూ కరెంటు స్తంభాన్ని తాకాడు. ఇలా తాకగానే కరెంట్ షాక్ కొడుతూ ఆ బాలుడు స్తంభానికి అతుక్కుపోయాడు.

పాపం.. అభం శుభం తెలియని బాలుడు.. కరెంటు స్తంభాన్ని ముట్టుకున్నాడు..

ఆ గ్రామానికి చెందిన ఆదిల్ అనే బాలుడు మరొక బాలుడితో కలిసి సరదాగా ఆడుకుంటూ రోడ్డుపై వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిల్ రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని తాకాడు. అప్పటికే ఆ స్తంభం వెంట విద్యుత్ ప్రవాహం వస్తుండడంతో ఒక్కసారిగా ఆ బాలుడు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దీంతో అతని శరీరం నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఈ విధంగా ఆ బాలుడు విద్యుత్ ఘాతానికి గురై కొట్టుమిట్టాడుతుంటే ఈ విషయాన్ని గమనించిన ఓ స్థానికుడు ఎంతో ధైర్యం చేశాడు.

ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి ఆ బాలుడిని కాపాడాలనే ఉద్దేశంతో అక్కడే ఉన్న ఒక చెక్కతో ఆ బాలుడి చేతిని కొట్టి పక్కకు లాగాడు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున స్థానికులు చేరుకుని ఆ బాలుడిని రక్షించే పనిలో పడ్డారు. అయితే వారు అతన్ని బయటకు తీసి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆ బాలుడి శరీరం బాగా కాలిపోయింది. దీంతో అతను విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇలా ఎవరి పిల్లలకూ జరగకూడదు. కనుక చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment