సాధారణంగా ఎవరైనా గొడవ పడుతుంటే కొందరు వ్యక్తులు ఆ గొడవ మధ్యలో జోక్యం చేసుకొని ఆ గొడవను అంతటితో ఆపే ప్రయత్నం చేస్తారు. మరికొందరు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం ఎందుకంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే ఓ వ్యక్తి భార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలోకి దూరి ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ గొడవను ఆపడానికి వెళ్లిన ఆ వ్యక్తి వారి చేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..
గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్‌లో నివాసముంటున్న గోగులపాటి బెన్ని మద్యానికి బానిసగా మారి తరచూ తన భార్యను ఎన్నో చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే ప్రతిరోజు తాగివచ్చి తన భార్యతో గొడవ పడగా తన భార్య మద్యం మానేయాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసేది. ఈ క్రమంలోనే రాత్రి బెన్నీ బాగా తాగి వచ్చి తన భార్యను కొడుతున్న క్రమంలో సమీప బంధువు శ్యాంసన, పక్కనే ఉన్న ఏచూరి సత్యనారాయణ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
కాగా బెన్నీ కుమారుడు జానా.. మా గొడవ మధ్యలో మీ జోక్యం ఏంటి అంటూ వారిపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే వారి మధ్య మాటా మాటా పెరగడంతో ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న బెన్నీ ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి సత్యనారాయణ పై దాడి చేశాడు. ఈ క్రమంలోనే అతనికి తీవ్ర గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత అతన్ని ఇంటికి తీసుకురాగా అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించి మరణించాడు. కాగా హత్యకు పాల్పడిన బెన్నితోపాటు అతని కుమారుడు జానాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…