భార్య భర్తల గొడవలోకి దూరాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు..

September 4, 2021 11:01 AM

సాధారణంగా ఎవరైనా గొడవ పడుతుంటే కొందరు వ్యక్తులు ఆ గొడవ మధ్యలో జోక్యం చేసుకొని ఆ గొడవను అంతటితో ఆపే ప్రయత్నం చేస్తారు. మరికొందరు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం ఎందుకంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే ఓ వ్యక్తి భార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలోకి దూరి ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ గొడవను ఆపడానికి వెళ్లిన ఆ వ్యక్తి వారి చేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..

భార్య భర్తల గొడవలోకి దూరాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు..

గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్‌లో నివాసముంటున్న గోగులపాటి బెన్ని మద్యానికి బానిసగా మారి తరచూ తన భార్యను ఎన్నో చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే ప్రతిరోజు తాగివచ్చి తన భార్యతో గొడవ పడగా తన భార్య మద్యం మానేయాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసేది. ఈ క్రమంలోనే రాత్రి బెన్నీ బాగా తాగి వచ్చి తన భార్యను కొడుతున్న క్రమంలో సమీప బంధువు శ్యాంసన, పక్కనే ఉన్న ఏచూరి సత్యనారాయణ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

కాగా బెన్నీ కుమారుడు జానా.. మా గొడవ మధ్యలో మీ జోక్యం ఏంటి అంటూ వారిపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే వారి మధ్య మాటా మాటా పెరగడంతో ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న బెన్నీ ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి సత్యనారాయణ పై దాడి చేశాడు. ఈ క్రమంలోనే అతనికి తీవ్ర గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత అతన్ని ఇంటికి తీసుకురాగా అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించి మరణించాడు. కాగా హత్యకు పాల్పడిన బెన్నితోపాటు అతని కుమారుడు జానాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now