క్రికెట్

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌ను ఓడిస్తాం.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజ‌మ్‌.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అంటున్న నెటిజ‌న్లు..

క‌రోనా కార‌ణంగా భార‌త్‌లో జ‌ర‌గాల్సిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 ను యూఏఈలో నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14వ తేదీ వ‌ర‌కు ఆ టోర్నీ జ‌ర‌గనుంది. దీంతో ఆ టోర్నీలో జ‌ర‌గ‌నున్న భార‌త్‌, పాకిస్థాన్‌పై ఇప్ప‌టి నుంచే అంద‌రూ ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో భాగంగా అక్టోబ‌ర్ 24న చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాకిస్థాన్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దుబాయ్‌లో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దీంతో అంద‌రూ ఆ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పాక్‌తో సంబంధాలు దెబ్బ తిన్నాక ఆ దేశం మ‌న ద‌గ్గ‌ర, మ‌న వాళ్లు అక్క‌డ మ్యాచ్‌ల‌ను ఆడ‌డం లేదు. కేవ‌లం ఐసీసీ టోర్న‌మెంట్‌ల‌లోనే పాక్‌తో భార‌త్ ఆడుతోంది. అయితే త్వ‌ర‌లో మ‌రో ఐసీసీ ఈవెంట్‌లో ఈ రెండు దేశాలూ త‌ల‌ప‌డ‌నుండ‌డంతో అభిమానులు అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక ఇదే విష‌యమై పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజ‌మ్ స్పందిస్తూ.. ఈసారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో భార‌త్‌పై క‌చ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్య‌క్తం చేశాడు. భార‌త్‌పై పైచేయి సాధిస్తామ‌న్నాడు. అక్టోబ‌ర్ 24న జ‌రిగే మ్యాచ్‌లో భార‌త్‌ను ఓడిస్తామ‌ని అన్నాడు.

అయితే భార‌త అభిమానులు మాత్రం బాబ‌ర్ అజ‌మ్ కామెంట్ల‌ను లైట్ తీసుకుంటున్నారు. భార‌త్ ను ఓడించ‌డం మీ వ‌ల్ల కాద‌ని, బాబ‌ర్ అజ‌మ్ మ‌రీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM