బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ కార్యక్రమం గురించి తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ కార్యక్రమానికి గత 2 సీజన్ల నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే 5వ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనుండడంతో ఈ కార్యక్రమంపై ఎన్నో అంచనాలు పెరిగాయి.
సెప్టెంబర్ 5వ తేదీన ప్రసారం కాబోయే ఈ కార్యక్రమం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. సీజన్ ఫైవ్ లో పాల్గొని కంటెస్టెంట్ లు వెళ్లే అంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరినీ క్వారంటైన్ కి పంపించారు. ఇక రెండు రోజుల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎవరనేది తెలియనుండడంతో బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించే నాగార్జున తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈసారి ప్రసారం కాబోయే బిగ్ బాస్ కార్యక్రమంలో ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని, ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని తెలిపారు. కొత్త కంటెస్టెంట్స్ తో కొత్త కార్యక్రమం కోసం టీం మొత్తం గత కొన్ని నెలల నుంచి ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. కొత్త సీజన్ లో కొత్త కంటెస్టెంట్ లతో ఈ కార్యక్రమం చేయడం ఎంతో చాలెంజింగ్ గా ఉంటుందని, తప్పకుండా ఈ సీజన్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి బాగా నచ్చుతుందని ఈ సందర్భంగా నాగార్జున తెలియజేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…