కోవిడ్ మొదటి వేవ్ నుంచి ఇప్పటికీ నటుడు సోనూసూద్ ప్రజలకు సహాయం చేస్తూనే ఉన్నాడు. సహాయం కోసం వచ్చిన వారిని కాదనకుండా, లేదనకుండా ఆదుకుంటున్నాడు. ఇక పేదలకు సహాయం చేయడం కోసం సోనూసూద్ ఏకంగా తన ఆస్తులనే తాకట్టు పెట్టాడు. దీంతో సోనూసూద్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఏర్పడ్డారు. సోనూసూద్ రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలను పోషించినా రియల్ లైఫ్‌లో మాత్రం స్టార్ హీరో అని ఆయన అభిమానులు ఆయనను పొగుడుతున్నారు.
ఇక సోనూసూద్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. తాను సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నానని తెలిపారు. గతంలో కన్నా ఇప్పుడు సినిమా ఆఫర్లు భారీగానే వస్తున్నాయని, అయితే అన్ని సినిమాల్లోనూ నటించలేను కనుక తనకు ఆసక్తిగా అనిపించిన సినిమాల్లోనే నటిస్తున్నానని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలు అలాగే కొనసాగుతాయని, సహాయం కోసం వచ్చిన వారిని కచ్చితంగా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
ఇక ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు మళ్లీ తగ్గుతున్నాయి కనుక సినిమాలపై ఫోకస్ పెట్టానని సోనూసూద్ తెలిపాడు. అయినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలను ఆపేది లేదన్నాడు. తాను తన తల్లిదండ్రుల నుంచి సేవాభావాన్ని అలవర్చుకున్నానని తెలిపాడు. తాను ఒక సాధారణ వ్యక్తినేనని అన్నాడు. తన ఫౌండేషన్‌లో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 400 మంది పనిచేస్తున్నారని, వారు అవసరం ఉన్నవారికి సహాయం అందిస్తున్నారని తెలియజేశాడు.
కాగా సోనూసూద్ కోవిడ్ మొదటి వేవ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులను రైళ్లు, బస్సులు, విమానాలు, ఇతర వాహనాల్లో సొంత గ్రామాలకు తరలించేందుకు ఎంతో సహాయం చేశాడు. తరువాత ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నవారికి అండగా నిలిచాడు. ఇప్పుడు అనేక హాస్పిటళ్ల వద్ద ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి బాధితులకు ఆక్సిజన్‌ను అందిస్తున్నాడు. నిజంగా సోనూసూద్ రియల్ హీరోనే కదా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…