స‌హాయం కోరి ఎవ‌రు వ‌చ్చినా త‌ప్ప‌క ఆదుకుంటా: సోనూసూద్

July 18, 2021 2:24 PM

కోవిడ్ మొద‌టి వేవ్ నుంచి ఇప్ప‌టికీ న‌టుడు సోనూసూద్ ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేస్తూనే ఉన్నాడు. స‌హాయం కోసం వ‌చ్చిన వారిని కాద‌నకుండా, లేద‌న‌కుండా ఆదుకుంటున్నాడు. ఇక పేద‌ల‌కు స‌హాయం చేయ‌డం కోసం సోనూసూద్ ఏకంగా త‌న ఆస్తుల‌నే తాక‌ట్టు పెట్టాడు. దీంతో సోనూసూద్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు. సోనూసూద్ రీల్ లైఫ్‌లో విల‌న్ పాత్ర‌ల‌ను పోషించినా రియ‌ల్ లైఫ్‌లో మాత్రం స్టార్ హీరో అని ఆయ‌న అభిమానులు ఆయ‌న‌ను పొగుడుతున్నారు.

will help everybody who come ask for help says sonusood

ఇక సోనూసూద్ తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అనేక విష‌యాల‌ను వెల్ల‌డించారు. తాను సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను చేస్తూనే మ‌రోవైపు సినిమాల్లోనూ న‌టిస్తున్నాన‌ని తెలిపారు. గ‌తంలో క‌న్నా ఇప్పుడు సినిమా ఆఫ‌ర్లు భారీగానే వ‌స్తున్నాయ‌ని, అయితే అన్ని సినిమాల్లోనూ న‌టించ‌లేను క‌నుక త‌న‌కు ఆస‌క్తిగా అనిపించిన సినిమాల్లోనే న‌టిస్తున్నాన‌ని తెలిపారు. సామాజిక సేవా కార్య‌క్రమాలు అలాగే కొన‌సాగుతాయ‌ని, స‌హాయం కోసం వ‌చ్చిన వారిని క‌చ్చితంగా ఆదుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక ప్ర‌స్తుతం కోవిడ్ ప‌రిస్థితులు మ‌ళ్లీ త‌గ్గుతున్నాయి క‌నుక సినిమాల‌పై ఫోక‌స్ పెట్టాన‌ని సోనూసూద్ తెలిపాడు. అయిన‌ప్ప‌టికీ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను ఆపేది లేద‌న్నాడు. తాను త‌న త‌ల్లిదండ్రుల నుంచి సేవాభావాన్ని అల‌వ‌ర్చుకున్నాన‌ని తెలిపాడు. తాను ఒక సాధార‌ణ వ్య‌క్తినేన‌ని అన్నాడు. త‌న ఫౌండేషన్‌లో ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 400 మంది ప‌నిచేస్తున్నార‌ని, వారు అవ‌స‌రం ఉన్న‌వారికి స‌హాయం అందిస్తున్నార‌ని తెలియ‌జేశాడు.

కాగా సోనూసూద్ కోవిడ్ మొద‌టి వేవ్‌లో దేశ‌వ్యాప్తంగా ఉన్న వ‌ల‌స కార్మికుల‌ను రైళ్లు, బ‌స్సులు, విమానాలు, ఇత‌ర వాహ‌నాల్లో సొంత గ్రామాల‌కు త‌ర‌లించేందుకు ఎంతో స‌హాయం చేశాడు. త‌రువాత ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న‌వారికి అండ‌గా నిలిచాడు. ఇప్పుడు అనేక హాస్పిట‌ళ్ల వ‌ద్ద ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసి బాధితుల‌కు ఆక్సిజ‌న్‌ను అందిస్తున్నాడు. నిజంగా సోనూసూద్ రియ‌ల్ హీరోనే క‌దా..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now