టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా మంచి పేరు సంపాదించుకున్న నాని సరసన ఇది వరకే రష్మికతో కలిసి”దేవదాస్”చిత్రంలో సందడి చేశారు. ఈ చిత్రంలో రష్మిక పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేశారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుందనే ప్రచారం జోరుగా వినిపిస్తుంది. ప్రస్తుతం నాని శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన ‘టక్ జగదీష్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అదేవిధంగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం తెరకెక్కుతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఈ రెండు సినిమాల తర్వాత నాని ‘అంటే.. సుందరానికీ’ చేస్తున్నాడు. ఇవే కాకుండా వీటితో పాటు మరో రెండు సినిమాలకు కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నానికి జోడిగా రష్మికను తీసుకోవాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన చిత్రబృందం నుంచే వెలువడాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…