మరోసారి ఆ హీరోతో నటించనున్న రష్మిక?

May 22, 2021 9:18 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా మంచి పేరు సంపాదించుకున్న నాని సరసన ఇది వరకే రష్మికతో కలిసి”దేవదాస్”చిత్రంలో సందడి చేశారు. ఈ చిత్రంలో రష్మిక పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేశారు.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుందనే ప్రచారం జోరుగా వినిపిస్తుంది. ప్రస్తుతం నాని శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన ‘టక్ జగదీష్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అదేవిధంగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం తెరకెక్కుతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ఈ రెండు సినిమాల తర్వాత నాని  ‘అంటే.. సుందరానికీ’ చేస్తున్నాడు. ఇవే కాకుండా వీటితో పాటు మరో రెండు సినిమాలకు కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నానికి జోడిగా రష్మికను తీసుకోవాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన చిత్రబృందం నుంచే వెలువడాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now