ఆ ఒక్కమాట వల్ల హృదయం ముక్కలైందంటూ కంటతడి పెట్టిన.. బుట్ట బొమ్మ!

April 24, 2021 12:22 AM

ప్రతి ఒక్కరి జీవితంలో వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా తల్లిదండ్రుల తర్వాత విద్యాబుద్ధులు నేర్పిన గురువుల పట్ల ఎంతో భక్తి భావంతో ఉంటారు. ఈ విధంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువును ఏ విద్యార్థి ఎప్పటికీ మరిచిపోరు. ఈ క్రమంలోనే పూజా హెగ్డే తనకు చిన్నప్పుడు చదువు నేర్పించి మంచి స్థాయికి తీసుకొచ్చిన ఓ టీచర్ ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడ్చింది.

తనకెంతో ఇష్టమైన టీచర్ శ్రీమతి జెస్సికా దారువాల మరణించారనే వార్త తెలియడంతో నా గుండె ముక్కలయింది.మానెక్ జీ కూపర్‌లో మీరు ఉండి ఉంటే ఆ టీచర్ గొప్పతనం ఏమిటో మీకు తెలిసేది. ప్రపంచం ఈరోజు ఒక రత్నాన్ని కోల్పోయిందని మీకు తెలుసా? చదువులో ఎంతో వెనుకబడి ఉన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకు వచ్చిన టీచర్ చనిపోయారన్న వార్త తనను ఎంతో కృంగదీసిందని పూజ ఎమోషనల్ అయ్యారు.

ఐదు సంవత్సరాల క్రితం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తన టీచర్ గురించి చెప్పిన విషయాలను పూజా హెగ్డే పంచుకున్నారు. చదువులో ఎంతో వెనుకబడి ఉన్న తనను తన మాటల ద్వారా ఎంతో ప్రోత్సహించి నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన టీచర్ మరణవార్త తనని క్రుంగదీసిందని తన టీచర్ తో నా అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment