అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “లవ్ స్టోరీ”. ఈ సినిమా షూటింగ్ మొత్తం కరోనా రెండవ దశ కంటే ముందుగానే పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కరోనా కారణం చేత వాయిదా పడింది. ఈ క్రమంలోనే థియేటర్లు తెరుచుకోవడంతో ఈ సినిమా విడుదల చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాను వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
అయితే తాజాగా మరోసారి ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీన ఓటీటీలో నాని నటించిన “టక్ జగదీష్” చిత్రం విడుదల కానుంది, అదేవిధంగా 9వ తేదీ నితిన్ నటించిన “మాస్ట్రో” డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఇక కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ నటించిన తలైవి సినిమా 10వ తేదీన విడుదల కావడంతో లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వరుస సినిమాలన్నీ ఓటీటీ వేదికగా విడుదల కావడంతో నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీని మరోసారి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తిరిగి ఈ సినిమాను సెప్టెంబర్ 17 వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓటీటీలో ఏవైనా చిత్రాలు వాటి విడుదల తేదీని వాయిదా వేసుకుంటే లవ్ స్టోరీ సినిమా విధిగా 10వ తేదీనే విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…